BREAKING
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని కలసిన కార్పొరేటర్ షాహినా. ఇంకొల్లు సర్పంచ్ గా షేక్ మహమ్మద్ రఫీ ఇంకొల్లు సర్పంచ్ గా షేక్ మహమ్మద్ రఫీ సదాశివపల్లిలో రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి విజ్ఞాన పరిషత్ ఎన్నికల ప్రచారం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం.. ఓటు హక్కును నిలబెట్టుకుందాం! ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీ కలిసిన కార్పొరేటర్ శంకర్ యాదవ్. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ ఆధ్వర్యంలో సరళ ఫిజిక్స్ కాన్‌క్లేవ్`2026 కొమ్మరపూడి నామినేషన్ల తిరస్కరణపై సీపీఐ ఆందోళన! టవర్ లైట్స్ కి శంకుస్థాపన అగ్ని ప్రమాదంలో బస్సు దగ్ధం చంద్రబాబును కలిసిన కార్పొరేటర్ ఆర్ సి మునికృష్ణ ఏపిలగుంటలో పొడమేకల ముమ్మర ప్రచారం అభివృద్ధి పనులకు శంకుస్థాపన జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై లారీలు.. వాహనదారులకు తప్పని ఇబ్బందులు! భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనగా నిర్వహించిన గ్రామ సర్పంచ్

11వ వార్డులో అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులపై తక్షణ స్పందన – కార్పొరేటర్ శాఖరి శ్రీనివాస్

Select Suryaa Now
11వ వార్డులో అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులపై తక్షణ స్పందన – కార్పొరేటర్ శాఖరి శ్రీనివాస్

సాగర్ నగర్, మేజర్ న్యూస్: భీమిలి నియోజకవర్గం 11వ వార్డు పరిధిలోని సుభాష్ నగర్, వైఎల్పీ లేఔట్, రాజీవ్ నగర్ ప్రాంతాల్లో డ్రైనేజీ కాలువ నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయని స్థానికులు కార్పొరేటర్ శ్రీ శాఖరి శ్రీనివాస్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన కార్పొరేటర్ గారు జీవీఎంసీ అసిస్టెంట్ ఇంజనీర్‌ను పిలిపించి పనుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. సంబంధిత కాంట్రాక్టర్‌ను కూడా పిలిపించి, ఎటువంటి జాప్యం లేకుండా అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అదేవిధంగా గణేష్ నగర్ ప్రాంతంలో తాగునీటి సమస్యతో పాటు చెత్త పేరుకుపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు తెలియజేయగా, సంబంధిత అధికారులతో మాట్లాడి సాయంత్రంలోపు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, అధికారులతో సమన్వయం చేసుకుంటూ వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని కార్పొరేటర్ శ్రీ శాఖరి శ్రీనివాస్  తెలిపారు.
కార్యక్రమంలో జనసేన నాయకులు కొర్రయి అనిల్, గద్దిపల్లి అప్పలరాజు, ఉప్పులురి శంకర్ బాకీ రాంబాబు, టీడీపీ నాయకులు సారిపల్లి శ్రీను, శ్రీమతి మంగదేవి  తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు