ఎస్సీ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్: భారీ సబ్సిడీతో ఎలక్ట్రిక్ వాహనాల పంపిణీ!
Mon, Mar 16, 2026, 07:51 PM
|
|
by Suryaa Desk | Mon, Mar 09, 2026, 10:24 AM
నల్లగొండ హైదరాబాద్ రోడ్డులోని అన్లిమిటెడ్ షాపింగ్ మాల్ ఎదుట ఆదివారం రాత్రి ఒంటిగంటకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వచ్చిన కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొని, రోడ్డుపై పనిచేస్తున్న మున్సిపల్ మహిళా కార్మికురాలిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలై, రెండు కాళ్లు విరిగినట్లు సమాచారం. స్కూటీపై వెళ్తున్న యువకుడికి తలకు గాయాలవడంతో అతని పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తరలించగా, యువకుడిని మెరుగైన చికిత్స కోసం ఐకాన్ ఆసుపత్రికి పంపారు. పోలీసులు కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.