|
|
by Suryaa Desk | Fri, Jul 25, 2025, 11:22 PM
హైదరాబాద్ నగరంలో ఈ సాయంత్రం నుంచి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వర్షపాతం తీవ్రంగా ఉండటంతో పలు ప్రాంతాల్లో రోడ్లపైకి భారీగా నీరు చేరింది. ముఖ్యంగా మాదాపూర్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్ వంటి ప్రాంతాల్లో వరదనీటి కారణంగా ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. దీనివల్ల వాహనదారులు మరియు ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.ఇదిలా ఉండగా, రాత్రంతా వర్షం కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జీహెచ్ఎంసీ పరిపాలన పరిధిలోని కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయబడింది. భారీ వర్షాల ప్రభావంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితులు కాకపోతే ఇంట్లోనే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.అయితే, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. విద్యుత్ సంబంధిత సమస్యలుంటే వెంటనే అధికారులకు సమాచారం అందజేయాలి.. వర్షపు నీరు నిలిచిన ప్రాంతాల్లో జాగ్రత్తగా వాహనాలు నడపాలి.. శనివారం తెల్లవారుజాము వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరం అయితే తప్ప ఇల్లు దాటి బయటకు రావొద్దని సూచించింది. అత్యవసర సహాయం కోసం 040-21111111, 040-29555500, 9000113667 నంబర్లలో సంప్రదించాలని తెలియజేశారు. మరోవైపు రాష్ట్రంలో కూడా అనేక జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.అత్యవసర సమయంలో తప్ప బయటకు వెళ్లకూడదు అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ మరోసారి విజ్ఞప్తి చేసింది.