![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 17, 2025, 07:31 PM
గురువారం మునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ప్రతి ఒక్క రోగికి మెరుగైన వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రిలో వ్యాక్సినేషన్, జ్వరం సర్వేను పరిశీలించి, మెడికల్ స్టాక్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మునిపల్లి తాహశీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు.