|
|
by Suryaa Desk | Thu, Jul 17, 2025, 03:03 PM
పరస్పర విమర్శల దాడి:
తెలంగాణ రాజకీయాల్లో తాజా వేడి వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డి నుంచి వచ్చాయి. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ప్రతిపక్ష హోదా కూడా తన తండ్రి కేసీఆర్ ఇవ్వడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. "కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంటో, స్లీపింగ్ ప్రెసిడెంటో నాకు తెలియదు. ముందు కుటుంబం అంతా ఒక తాటిపైకి రావాలి" అని తూర్పారపడ్డారు.
కవితపై సంచలన వ్యాఖ్యలు:
కేటీఆర్ చెల్లి కవితపై కూడా సీఎం రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "కవితకు ఆమె ఇంట్లోనే విలువ లేదు. ఆమె నాయకత్వాన్ని కుటుంబమే ఒప్పుకోవడం లేదు" అని ఆరోపించారు. ఇది బీఆర్ఎస్ లో అంతర్గతంగా ఉన్న భేదాభిప్రాయాలను బయటపెడుతోందని ఆయన భావం.
వ్యక్తిగత శత్రుత్వం లేదన్న రేవంత్:
రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యల్లో, "నాకు ఎవరితోనూ వ్యక్తిగత శత్రుత్వం లేదు, వైరుధ్యం లేదు. కేసీఆర్ నా రాజకీయ ప్రత్యర్థి మాత్రమే" అంటూ స్పష్టం చేశారు. తాను వ్యక్తిగత విమర్శలు చేయడంలేదని, రాజకీయ వ్యవహారాలపైనే తన విమర్శలు కేంద్రీకృతమవుతున్నాయని ఆయన తెలిపారు.