![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 17, 2025, 03:01 PM
ఢిల్లీ పర్యటనలో భాగంగా జరిగిన ఓ చిట్‌చాట్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ అవినీతిపై విచారణ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. "విలన్లు క్లైమాక్స్‌లోనే అరెస్ట్ అవుతారు" అనే తార్కిక వ్యాఖ్యతో రాజకీయ రంగంలో ఉత్కంఠ పెంచారు. కేసీఆర్ నేతృత్వంలోని గత ప్రభుత్వం పాలనలో జరిగిన అవకతవకలపై చర్యలు తప్పవని హింట్ ఇచ్చారు.
బీసీ రిజర్వేషన్లపై తమ వ్యూహం సిద్ధమై ఉందని సీఎం తెలిపారు. ఈ విషయంలో కేంద్రంతో కలిసి ముందుకు వెళ్లేందుకు తాము సిద్ధమని వివరించారు. తాము రాష్ట్ర సమస్యల పరిష్కారానికి స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను రూపొందించామని, ముఖ్యంగా జల వివాదాలపై కేంద్రంతో సమన్వయం చేస్తామన్నారు.
కేటీఆర్ డ్రగ్స్ కేసుపై విచారణ కొనసాగుతోందని, ఇందులో ఎవరూ కూడా తప్పించుకోలేరని సీఎం తెలిపారు. "కేటీఆర్, లోకేష్‌ల మీటింగ్ సంగతేంటి?" అని ప్రశ్నిస్తూ మరింత రాజకీయ దుమారం రేపే విధంగా వ్యాఖ్యానించారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సిన అవసరం ఉందని, ప్రజాప్రతినిధిగా తన బాధ్యతను నిర్వర్తించాలన్నారు.