![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 17, 2025, 12:03 PM
బీసీ బిల్లుపై కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. గురువారం క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బీసీలపై బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు మొసలి కన్నీరు కారుస్తూ.. కపట ప్రేమ చూపుతున్నారని చెప్పారు. నిజంగా మీకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే, కేంద్రంలో బిల్లులు ఆమోదించాలని చెప్పారు.