![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 17, 2025, 11:45 AM
హైదరాబాద్‌లో మందుబాబుల కోసం పోలీసులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై పగలు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించనున్నారు. ఇటీవల కొందరు స్కూల్ బస్సు డ్రైవర్లు ఉదయమే మద్యం సేవించి వాహనాలు నడిపినట్టు గుర్తించి, 24 గంటలూ తనిఖీలు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం రాత్రివేళల్లో వందల మందిని పోలీసులు పట్టుకుంటున్నారు.మద్యం సేవించి వాహనం నడపడం (డ్రంక్ అండ్ డ్రైవ్) వల్ల భారీ ప్రమాదాలు, తీవ్ర అనర్థాలు జరుగుతాయి. ఇది నడిపే వ్యక్తి ప్రాణాలకే కాదు.. రోడ్డుపై ఉన్న అమాయకుల ప్రాణాలకు కూడా పెద్ద ముప్పు. మద్యం మత్తులో వాహనం నడపడం వల్ల సరైన నిర్ణయాలు తీసుకోలేరు.. దృష్టి మందగిస్తుంది.. వేగంపై అదుపు కోల్పోతారు. దీనివల్ల ప్రమాదాలు పెరిగి.. ప్రాణ నష్టం, తీవ్ర గాయాలు, ఆస్తుల విధ్వంసం జరుగుతాయి.