![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 16, 2025, 11:51 AM
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామంలో తన సొంత భూమి, బంగారం తాకట్టు పెట్టి అభివృద్ధి పనులు చేసిన మాజీ సర్పంచ్ తాళ్ల విజయలక్ష్మి . రూ.11 లక్షల బకాయిలు రావాలని ప్రభుత్వానికి ఎన్ని సార్లు బిల్లులు సమర్పించినా పట్టించుకోని అధికారులు . ఎన్ని సార్లు వేడుకున్నా బిల్లులు మంజూరు అవ్వకపోవడంతో, అప్పులు ఇచ్చిన వారికి సమాధానం చెప్పలేక మనస్తాపానికి గురైన విజయలక్ష్మి . అప్పులకు వడ్డీలు పెరిగాయని అప్పు ఇచ్చిన వారు వేధించడంతో ఆవేదనలో గడ్డి మందు గుళికలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ విజయలక్ష్మి భర్త రవి. చికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉందని తెలిపిన వైద్యులు