![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 16, 2025, 12:27 PM
రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 109 భూములకు సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి బుధవారం మాజీమంత్రిని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిసి వివరించారు. ఈ కార్యక్రమంలో గుమ్మడిదల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.