![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 16, 2025, 11:45 AM
వీధి కుక్కలకు ఆహారం పెట్టాలనుకునేవారు వీధుల్లో కాకుండా, వారి ఇంట్లోనే ఆహారం ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించిన సుప్రీంకోర్టు . కాలనీలలోని వీధి కుక్కలకు ఆహారం పెడుతున్నందుకు స్థానికులు వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ. వీధి శునకాలకు ఆహారం పెట్టాలనుకునేవారు ప్రతి రోడ్డును ఉపయోగించుకుంటే మనుషులకు స్థలం ఎక్కడ ఉంటుందని ప్రశ్నించిన ధర్మాసనం. శునకాలపై ప్రేమ ఉన్నవారు వాటిని తమ ఇంటికే తీసుకెళ్లి ఆహారం పెడితే ఎవరు ఆపుతారని అడిగిన సుప్రీం . సంక్షేమ సంఘాలు, అపార్ట్‌మెంట్ ఓనర్ అసోసియేషన్లు తమ ప్రాంతంలోని శునకాలకు ఆహారం ఇవ్వడానికి అవసరమైన ఏర్పాట్లు చేసే బాధ్యత ఉంటుందని నోయిడాకు చెందిన ఓ వ్యక్తి అలహాబాద్ హైకోర్టులో పిటిషన్. ఇందుకోసం ప్రజలు ఎక్కువగా రాకపోకలు సాగించని ప్రదేశాలలో కుక్కలకు ఫీడింగ్ పాయింట్లు ఏర్పాట్లు చేయాలని కోరిన పిటిషనర్