![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jul 14, 2025, 10:38 AM
సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి బోనాల ఉత్సవాల్లో భాగమైన ‘రంగం’ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది. మాతంగి స్వర్ణలత భవిష్యవాణి చేస్తూ, దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడే భారం తనదేనని చెప్పారు. ఈ ఏడాది వర్షాలు బాగా పడతాయని, పంటలు సమృద్ధిగా పండతాయని తెలిపారు. ‘‘మీరు పిల్లలను విడిచిపెడుతున్నా, నేను కడుపులో పెట్టుకుని కాచుకుంటున్నాను,’’ అంటూ భక్తులపై ప్రేమను వ్యక్తం చేశారు.మాతంగి ఆలయంలో మాతంగి స్వర్ణలత చేసిన భవిష్యవాణి కలకలం రేపుతోంది. అగ్నిప్రమాదాలు జరగబోతున్నాయంటూ ఆమె హెచ్చరించింది. అంతేకాక, మహమ్మారి మళ్లీ ప్రజలను వెంటాడే అవకాశం ఉందని స్వర్ణలత పేర్కొంది. ఈ హెచ్చరికల నేపథ్యంలో భక్తులు ఆందోళన చెందుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.