|
|
by Suryaa Desk | Sun, May 25, 2025, 02:47 PM
పటాన్చెరు : అన్నా అంటే నేనున్నా అంటూ నిరుపేద మహిళ వివాహానికి అండగా నిలిచారు పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు. నియోజకవర్గ పరిధిలోని ప్రజల కష్టసుఖాల్లో వెన్నంటి నిలుస్తూ..ఎప్పటికప్పుడు తన దాతృత్వాన్ని చాటుకుంటూ మనసున్న మహారాజుగా ప్రజల గుండెల్లో నిలుస్తున్నారు ఎమ్మెల్యే జిఎంఆర్. రాజాగా.. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరు గ్రామానికి చెందిన వాటర్ వర్క్స్ ఉద్యోగి మాణిక్యం ఇటీవల మృతి చెందారు. ఆయన కుమార్తె వివాహం నిశ్చయం కావడంతో. ఆదివారం వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే జిఎంఆర్ కు పెళ్లి పత్రికను అందించారు. మాణిక్యంతో తనకున్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్.. వివాహానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించి గొప్ప మనసు చాటుకున్నారు. భవిష్యత్తులోనూ వారి కుటుంబానికి అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొల్లూరు మాజీ ఎంపీటీసీ నర్సింహులు, తదితరులు పాల్గొన్నారు.