|
|
by Suryaa Desk | Tue, May 13, 2025, 01:18 PM
మంచిర్యాల జిల్లాలో నాణ్యమైన ధాన్యాన్ని రైతుల నుంచి సకాలంలో కొనుగోలు చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. జైపూర్ మండలంలోని సత్తుపల్లి, నర్సింగాపూర్, కుందారం, కృష్ణాపూర్, పౌనూరు, శివ్వారం, వేలాల గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సోమవారం సందర్శించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతులు తీసుకొచ్చే వరి ధాన్యం నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూస్తామన్నారు. ముఖ్యంగా సన్న రకం వడ్లకు మద్దతు ధరతో పాటు రూ.500 అదనంగా బోనస్‌గా ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ప్రతి రైతుకూ మద్దతుగా నిలిచి, వారి ఉత్పత్తికి న్యాయమైన ధర లభించేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
కేంద్రాల్లో తూకాలు న్యాయంగా జరగాలని, బస్తాల కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం విక్రయించేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అన్నారు.