|
|
by Suryaa Desk | Wed, Oct 01, 2025, 05:46 PM
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మన శంకరవరప్రసాద్ గారు' చిత్రం నుంచి ఓ ఆసక్తికరమైన అప్‌డేట్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న నయనతార పాత్ర పేరుతో పాటు ఆమె ఫస్ట్ లుక్‌ను అభిమానులతో పంచుకున్నారు.ఈ చిత్రంలో నయనతార 'శశిరేఖ' అనే పాత్రలో కనిపించనున్నట్లు దర్శకుడు అనిల్ రావిపూడి సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' ద్వారా అధికారికంగా ప్రకటించారు. పాత్రకు సంబంధించిన లుక్‌ను కూడా విడుదల చేయగా, అది ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా, దసరా పండగ సందర్భంగా రేపు మరో సర్‌ప్రైజ్ కూడా రాబోతోందని అనిల్ రావిపూడి తన పోస్టులో పేర్కొన్నారు. దీంతో అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. పండగ రోజు రాబోయే ఆ కొత్త కబురు ఏమై ఉంటుందా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్ కూడా ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తుండటం విశేషం. చిరంజీవి, వెంకటేశ్ వంటి అగ్ర తారలు కలిసి నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి, ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని గతంలోనే మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Latest News