BREAKING
ఎర్రగుంట సర్పంచును సన్మానించిన హీరేహాళ్ మండల కురుబ యూత్!! ఎన్నికల నియమావళికి తూట్లు! శిలాఫలకాలను కప్పడంలో అధికారుల నిర్లక్ష్యం ఎంపీడీవో పర్యవేక్షణ ఎక్కడని స్థానికుల ప్రశ్నలు అధికారుల నిర్లక్ష్యం అదుపుతప్పి కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు స్పీడ్ బ్రేకర్ వద్ద సూచిక బోర్డు లేక రోడ్డు ప్రమాదం స్పీడ్ బ్రేకర్ వద్ద కారును ఢీకొట్టిన బస్సు. బీజేపీ ఎంపీలకు అధిష్ఠానం కీలక ఆదేశాలు.. నేడు మోదీ నివాసంలో భేటీ! రేపు పార్లమెంట్ ముందుకు డీలిమిటేషన్ బిల్లు.. ఢిల్లీలో వేడెక్కిన రాజకీయం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన జాతీయ మహిళా కాంగ్రెస్ కార్యదర్శి అదిత పాయసంపల్లె పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. ఇరువర్గాల మధ్య ఘర్షణ శామ్‌సంగ్ తొలి హ్యూమనాయిడ్ రోబోట్ సిద్ధం 29.11.2026 నుండి 05.12.2026 వరకు ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు) | weekly horoscope by Dr Edupuganti Padmaja Rani తుర్కయంజాల్, తొర్రూర్ డివిజన్‌లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు. అమెరికా బలగాలపై దాడులకు ఇరాన్ స్టార్‌లింక్ వినియోగం ట్రంప్ కుటుంబ మద్దతున్న వరల్డ్ లిబర్టీ క్రిప్టో టోకెన్ కుప్పకూలింది వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న ఎలుగుబంటి. ఉక్రెయిన్‌ నుంచి స్వీడన్‌ సంస్థ సాబ్‌కు రూ.4,100 కోట్ల రాడార్ ఆర్డర్ భక్తులతో కిటకిటలాడిన శ్రీ రామ తీర్థ పుటాలమ్మ క్షేత్రం

విధాత్రి విల్లాస్ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ క్షేత్రస్థాయి పరిశీలన*

Select Suryaa Now
విధాత్రి విల్లాస్ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ క్షేత్రస్థాయి పరిశీలన*

 కుత్బుల్లాపూర్ మేజర్ న్యూస్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తానని బీఆర్ఎస్ శాసనసభాపక్ష విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ తెలిపారు. శనివారం కొంపల్లి సర్కిల్ పరిధిలోని విధాత్రి విల్లాస్‌లో అధికారులతో కలిసి ఆయన పాదయాత్ర నిర్వహించి, కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విధాత్రి విల్లాస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, సమీప కాలనీల నివాసితులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. తక్కువ నీటి ఒత్తిడితో తాగునీరు సరఫరా అవుతుండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వివరించారు. 

కొంపల్లి నుంచి విధాత్రి విల్లాస్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై వీధి దీపాలు లేకపోవడంతో రాత్రి వేళల్లో చీకటిగా మారి రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు. ఇదే అదనుగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రహదారి వెంట ఇష్టానుసారంగా చెత్తను పడేస్తున్నారని వాపోయారు. కాలనీవాసుల సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. తాగునీటి సరఫరాలో నీటి ఒత్తిడిని పెంచి, నివాసితులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. ప్రధాన రహదారిపై వీధి దీపాలను ఏర్పాటు చేసి రాత్రి వేళల్లో ప్రజలకు భద్రతతో కూడిన రాకపోకలు కల్పించాలని తెలిపారు. రహదారుల వెంట అక్రమంగా చెత్తను పడవేయకుండా పర్యవేక్షణ పెంచాలని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. 

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి, వాటి పరిష్కారానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొంపల్లి మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ డి. లావణ్య, మాజీ ప్రజాప్రతినిధి సన్న కవితా శ్రీశైలం యాదవ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ రవీందర్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు సంగీతా రెడ్డి, నాయకులు పూజారి లక్ష్మణ్ గౌడ్, కృష్ణ సాగర్, షన్ను భాయ్, విధాత్రి విల్లాస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.