BREAKING
ఢిల్లీ వైపు సాగుతున్న భారత్-శ్రీలంక సైక్లింగ్ యాత్ర శ్రీ సత్య సాయి బాబా మహా సమాధిని దర్శించుకున్న కేంద్ర మంత్రి ఐక్యతతో పోరాడితేనే హార్డ్వేర్ పార్క్ భూ సమస్యకు పరిష్కారం జెలెన్స్కీపై రష్యా హత్యాయత్న కుట్రను భగ్నం చేసిన పోలాండ్ నిఘా వర్గాలు... ప్రభుత్వ భూములు అమ్మొద్దు - ఎంపీ ఆర్. కృష్ణయ్య శ్రీ సత్యసాయి మహా సమాజం దర్శించుకున్న కేరళ ముఖ్యమంత్రి శ్రీ సత్యసాయి మహా సమాజం దర్శించుకున్న కేరళ ముఖ్యమంత్రి వివోఏ లకు కనీస వేతనం ప్రకటించాలి ప్రభుత్వరంగాన్ని కార్పొరేట్లకు అప్పగించే కుట్ర.. రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం: ప్రొఫెసర్‌ హరగోపాల్‌ బెల్గాం ఎయిర్‌పోర్ట్ మూసివేత అలర్ట్: కమ్యూనిస్టుల ఐక్యతతోనే ప్రజా సమస్యలకు పరిష్కారం.: సినీ నటుడు మాదాల రవి ఉక్రెయిన్‌లో రష్యా డ్రోన్ దాడి విషాదం: 10 మంది పౌరుల దుర్మరణం..మృత్యుంజయుడిగా బయటపడ్డ చిన్నారి అంబటి సాహిత్యం ఫై సదస్సు.... అయోవాలో సీసం నిల్వలను పేల్చివేయాలన్న యూఎస్ ఆర్మీ నిర్ణయంపై కలకలం... ఏఎంఆర్‌పై అవగాహనకు కిమ్స్‌ ఆధ్వర్యంలో రన్ ఫర్ ఏఎంఆర్

వైజయంతి మ్యూజిక్ కన్సర్వేటరీకి 30 ఏళ్లు.. ఆడియో ల్యాబొరేటరీస్ ప్రారంభం

Select Suryaa Now
వైజయంతి మ్యూజిక్ కన్సర్వేటరీకి 30 ఏళ్లు.. ఆడియో ల్యాబొరేటరీస్ ప్రారంభం
ముషీరాబాద్ మేజర్ న్యూస్ :సంగీతాన్ని భావితరాలకు పరిరక్షించి అందించడమే వైజయంతి మ్యూజిక్ కన్సర్వేటరీ ప్రధాన లక్ష్యమని సంస్థ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ కేశవాచార్య తెలిపారు. సంగీతం కేవలం హాబీగా కాకుండా విద్యలో భాగం కావాలని, చిన్నతనం నుంచే సంగీతాన్ని అభ్యసించడం వల్ల జ్ఞాపకశక్తి, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసంతోపాటు మానవీయ విలువలు పెంపొందుతాయని పేర్కొన్నారు. సంస్థ 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమంలో పూర్తిగా విద్యార్థులే ప్రదర్శనలు ఇవ్వడం విశేషమన్నారు. ఆరు నెలలుగా సాధన చేసిన 50 మందికి పైగా విద్యార్థులు ఎలాంటి ప్రొఫెషనల్ ఆర్టిస్టుల సహాయం లేకుండా తమ ప్రతిభతో కార్యక్రమాన్ని నిర్వహించారని తెలిపారు. ఈ సందర్భంగా సంస్థకు అనుబంధంగా వైజయంతి మ్యూజిక్ ఆడియో ల్యాబొరేటరీస్‌ను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. దీని ద్వారా మ్యూజిక్ ప్రొడక్షన్, ఆడియో డబ్బింగ్‌తోపాటు సినీ పరిశ్రమకు అవసరమైన ఆడియో, వీడియో సేవలు అందించనున్నట్లు చెప్పారు. కన్సర్వేటరీలో శిక్షణ పొందిన విద్యార్థులు ఈ ల్యాబొరేటరీస్‌తో అనుసంధానమై తమ నైపుణ్యాలను మరింత అభివృద్ధి చేసుకోవడంతోపాటు ప్రతిభను ప్రదర్శించి సంగీత రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. శాస్త్రీయ సంగీతంతోపాటు వెస్ట్రన్ సంగీతంలోనూ శిక్షణ అందిస్తున్నామని, లండన్‌లోని 3డీ కాలేజ్ ఆఫ్ లండన్ అనుబంధ సంస్థగా వెస్ట్రన్ స్టాఫ్ నొటేషన్‌లో బోధన కొనసాగిస్తున్నామని వివరించారు. గాత్ర సంగీతంలో శిక్షణ పొందిన పలువురు విద్యార్థులు ఇప్పటికే వివిధ వేదికలపై ప్రదర్శనలు ఇస్తున్నారని తెలిపారు. అన్నమయ్య, పురందరదాసు వంటి వాగ్గేయకారుల కీర్తనల ద్వారా సంగీతంతోపాటు సాహిత్య, సాంస్కృతిక విలువలను భావితరాలకు అందించవచ్చన్నారు. సంగీతాన్ని నేర్పడమే కాకుండా పరిరక్షించి తరతరాలకు అందించాలనే సంకల్పంతోనే సంస్థకు కన్సర్వేటరీ అనే పేరు పెట్టినట్లు వివరించారు. గత మూడు దశాబ్దాలుగా సంగీతాన్ని తపస్సుగా భావించి సేవలందిస్తున్నామని, ఇప్పటివరకు పదివేలకు పైగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చామని చెప్పారు. తమ వద్ద శిక్షణ పొందిన పలువురు ప్రస్తుతం సంగీత ప్రదర్శనలు, సంగీత దర్శకత్వం తదితర రంగాల్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకుడు డాక్టర్ కేఎం రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరుకాగా, సంగీత దర్శకుడు, స్టూడియో నిర్వాహకుడు శ్రీధర్ ఆత్రేయతోపాటు సంస్థ పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు పాల్గొన్నారు.