BREAKING
కూటమి మేయర్ అభ్యర్థి అప్పలనాయుడుకు ఎమ్మార్పీఎస్ సంఘీభావం --మంత్రి నాదెండ్ల మనోహర్ ను కలిసిన పొలిమేర హరికృష్ణ అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ కార్యకర్తకు అండగా నిలిచిన కేంద్రమంత్రి వర్మ -- నాగరాజుకు రూ.1 లక్ష ఆర్థిక సాయం, ఇద్దరు కుమార్తెల విద్యా ఖర్చులు భరిస్తానని హామీ ధనలక్ష్మీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీమహమ్మారమ్మ కూటమి మేయర్ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి -- టిడిపి, బిజెపి శ్రేణులకు, ప్రజలకు మంత్రి నాదెండ్ల, శాసనసభ్యులు విజ్ఞప్తి జిల్లా పోలీస్ కార్యాలయం లో ఘనంగా ఆయుధ, వాహన పూజలు -- శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీవినీత్ నింభ కుసుమ హారతితో శాంతించిన అమ్మవారు ఉదయం మహిషాసుర మర్దిని.. సాయంత్రం కాళికాదేవిగా వాసవీ అమ్మవారి దర్శనం 25న విజయ భేతాళ స్వామి వాహన మహోత్సవం :అధికారుల కీలక సమీక్ష, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు! మిట్స్‌ వర్సిటీకి శోధ్‌గంగ,శోధ్‌గంగోత్రి ప్రాజెక్టుల అమలుకు ఎంఓయూ : వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి.యువరాజ్ పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా స్మృతి పరేడ్ రిహార్సల్స్ రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ సేవలు స్ఫూర్తిదాయకం : డాక్టర్ స్వాతి చక్రపాణి మూడు జడ్పీటీసీలు టీడీపీకే.. ఎంపీపీ పదవుల్లో జనసేనకు ఒకటి, టీడీపీకి రెండు కూటమి ఐక్యతే విజయానికి పునాది.. అభివృద్ధి, సంక్షేమమే ఎన్నికల అజెండా-ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ భక్తిశ్రద్ధలతో దుర్గమ్మ అమ్మవారి కి ప్రత్యేక పూజలు అంతరాయం లేని విద్యుత్తును అందించాలి. విద్యుత్ శాఖఈ ఈ రామయ్య. చిన్నారి వినయ్ వైద్యానికి సీఎం సహాయనిధి భరోసా : ఎమ్మెల్యే జహా

‘తొలిముద్ద’ తో చిన్నారులకు పౌష్టికాహారం -అంగన్‌వాడీ కేంద్రాల్లో అల్పాహార పథకాన్ని ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు.

Select Suryaa Now
 ‘తొలిముద్ద’ తో చిన్నారులకు పౌష్టికాహారం -అంగన్‌వాడీ కేంద్రాల్లో అల్పాహార పథకాన్ని   ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు.

చిన్నారుల ఎదుగుదలకు తొలిదశ నుంచే పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల్లో అల్పాహార పథకం ‘తొలిముద్ద’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి అల్పాహార (‘తొలిముద్ద’ )కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పిల్లలకు అల్పాహారాన్ని మంత్రి జూపల్లి స్వయంగా తినిపించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. మూడు నుంచి ఆరేళ్ల చిన్నారుల శారీరక, మానసిక  వికాసానికి పౌష్టికాహారం ఎంతో కీలకమని అన్నారు. చిన్నారులకు ఉదయం అల్పాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని చెప్పారు. అక్టోబరు 1 నుంచి నాగర్‌కర్నూల్‌తో పాటు రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో తొలిదశలో ‘తొలిముద్ద’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమం తప్పకుండా అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని కోరారు.
పౌష్టికాహారంతో పాటు ప్రీ-స్కూల్ విద్య అందించడం ద్వారా చిన్నారుల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి  కృషి చేస్తున్నట్లు తెలిపారు.

*ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం*

అంగన్‌వాడీ కేంద్రాల్లో ‘తొలిముద్ద’ కార్యక్రమం సక్రమంగా అమలయ్యేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. చిన్నారుల ఆరోగ్యం, పౌష్టికాహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. గ్రామస్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహార కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తల్లిదండ్రులు సహకరించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు.

పి. విజయ్ కుమార్, నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి , సూర్యన్యూస్