BREAKING
డీప్ ఫేక్ బారిన పడ్డ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల.. నెట్టింట వైరల్ అవుతున్న మార్ఫింగ్ వీడియో! ఏపీలో వెబ్‌ల్యాండ్‌ రికార్డుల ట్యాంపరింగ్‌ ముఠా గుట్టురట్టు హోంబలే ఫిల్మ్స్ నుంచి మరో భారీ ప్రాజెక్ట్.. ఏఐ టెక్నాలజీతో శరణాగతి యానిమేషన్ మూవీ! భారత చెస్ చరిత్రలో అరుదైన మైలురాయ.. 100వ గ్రాండ్‌మాస్టర్‌గా మధ్యప్రదేశ్ ప్లేయర్ అనూజ్ శ్రీవాస్త్రి! జిల్లాలో 544 పంచాయితీలకు 3 దశలలో ఎన్నికలు పెట్టుబడుల పండుగకు విశాఖ సిద్ధం అండర్-19 ఆసియా కప్‌లో చెలరేగిన ఆర్యవీర్ సెహ్వాగ్.. శుభ్‌మన్ గిల్ రికార్డును సమం చేసిన వీరేంద్ర తనయుడు! టెస్టుల్లో అరుదైన ఘనత సాధించిన శ్రీలంక పేసర్ అసిత ఫెర్నాండో.. లసిత్ మలింగ రికార్డు బ్రేక్! మద్ది ఆంజనేయస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు 81,106 వద్ద సెన్సెక్స్, 25,044 వద్ద నిఫ్టీ: బుధవారం మార్కెట్లు రీఓపెన్ రజనీకాంత్, కమల్ హాసన్ ఆరాధించే క్లాసిక్ చిత్రం.. శివాజీ గణేషన్ తిరువిళైయాడల్ గ్రాండ్ రీ-రిలీజ్! 11 వేల మంది ఉద్యోగులకు పాత పెన్షన్ అమలు హర్షణీయం.. ప్రభుత్వానికి కృతజ్ఞతలు.. ఏపీ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ పంట కాలువలో పడి వ్యక్తి గల్లంతు కొత్త వంతెన సమీపంలో ఘటన.. ముమ్మరంగా గాలింపు చర్యలు లక్షల కోట్ల వారుసురాలు, సామాన్యులతో సమానం విశాఖలో 'ఫ్రెండ్స్ క్రికెట్ లీగ్' మెగా క్రికెట్ హంగామా

సహాయక చర్యలలో ..'యువ ఆపద మిత్ర 'వాలంటీర్లు - కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే విజయ్ కుమార్

Select Suryaa Now
సహాయక చర్యలలో ..'యువ ఆపద మిత్ర 'వాలంటీర్లు - కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే విజయ్ కుమార్
సూర్య కామారెడ్డి జిల్లా ప్రతినిధి : ప్రకృతి విపత్తుల సమయంలో అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఉద్దేశించిన ‘యువ ఆపద మిత్ర’ పథకంలో భాగంగా, డిచ్‌పల్లిలోని ఏడవ బెటాలియన్‌లో నిర్వహించిన ఏడు రోజుల ప్రత్యేక శిక్షణ తరగతులను కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు విజయవంతంగా పూర్తి చేసుకున్నారు.ఈ శిక్షణ కార్యక్రమంలో విపత్తులు సంభవించినప్పుడు తక్షణమే స్పందించే విధానాలు, ప్రాథమిక చికిత్స, సిపిఆర్, ఫైర్ సేఫ్టీ మరియు క్రౌడ్ మేనేజ్‌మెంట్  వంటి పలు కీలక అంశాలపై వాలంటీర్లకు సమగ్రమైన అవగాహన, శిక్షణ అందించారు. ప్రకృతి విపత్తులు ఎదురైనప్పుడు స్థానికంగా ఉండే ఈ ‘యువ ఆపద మిత్ర’ వాలంటీర్లకు వెంటనే సమాచారం అందుతుందని, వారు నిమిషాల వ్యవధిలోనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడతారు.శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు సోమవారం కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె. విజయ్ కుమార్ చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ..ప్రకృతి విపత్తుల సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రాణాలను కాపాడటం అత్యంత పవిత్రమైన విధి. ఇటువంటి శిక్షణ ద్వారా విద్యార్థుల్లో సేవాభావం, సామాజిక బాధ్యత మరింత పెరుగుతాయని యువ ఆపద మిత్రులు సమాజానికి దిక్సూచిలా నిలుస్తారు" అని అభినందించారు.ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె. కిష్టయ్య, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ పి. విశ్వప్రసాద్,  డాక్టర్ ఏ. సుధాకర్, డాక్టర్ జి. శ్రీనివాసరావు, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్లు రాజశ్రీ, డాక్టర్ రాజ్ గంభీరావు, డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.