సాహిత కుటుంబానికి అండగా నిలిచినబీఆర్ఎస్ నేతలు - ఆర్థిక సహాయం..!
వేములపల్లి, మేజర్ న్యూస్ :
మానవత్వంపరిమళించిందిఆపదలో ఉన్నకుటుంబానికి గ్రామమంతాఅండగానిలిచింది.వేములపల్లిమండలం లోని రావులపెంటగ్రామానికి చెందిన ఇంద్రపల్లి సైదులు కుమార్తె సాహిత ఇటీవల అనారోగ్యంతోబాధపడుతూ అకాల మరణం చెందిన విషయం విదితమే. చిన్నారి మృతితో శోకసంద్రంలో మునిగిపోయినఆకుటుంబానికి బీఆర్ఎస్ నేతలు మానవతా చేయూతను అందించారు. బీఆర్ఎస్ గ్రామ శాఖ నాయకులు శుక్రవారంసైదులునివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, మనోధైర్యం కల్పించారు. ఈకష్టకాలంలో మేమున్నామంటూ భరోసా ఇస్తూ రూ. 7,500 నగదు ఆర్థికసహాయాన్నిఅందజేశారు. ఆపద సమయంలో అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
మానవత్వానికి ప్రతీకగా నిలిచిన ఈ కార్యక్రమంలో రావులపెంట గ్రామ పంచాయతీ సర్పంచ్ సందరబోయిన చంద్రయ్య, ఉప సర్పంచ్ పల్లా గోవర్ధన్, మాజీ ఎంపీటీసీ నంద్యాల శ్రీరామ్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ తరి సైదులు, బీఆర్ఎస్ నాయకులు జిన్నే శేఖర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.