BREAKING
బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ‘మొహబ్బత్’ నుంచి యూత్‌ఫుల్ లవ్ సాంగ్.. ‘వరమే’ పాట విడుదల ఆరు నెలలుగా జీతాలు లేవు ఔట్సోర్సింగ్ సిబ్బంది ఆవేదన.... పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి నిరసన వ్యక్తం చేసిన ఉద్యోగులు కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. 1,098 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్.. మయన్మార్ గనుల వల్ల నదుల కాలుష్యంపై ఆధారాల సేకరణకు థాయ్‌లాండ్ కసరత్తు డిసెంబర్ 24న స్వీడన్‌లో వెగోవీ మాత్రల ఆవిష్కరణకు నోవో నార్డిస్క్ సన్నాహాలు కోల్‌కతా ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైన తమిళ థ్రిల్లర్ ‘సాయవనం’: ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ ఆర్బీఐ స్వాప్ సదుపాయం ముగిసేలోపు డాలర్ బాండ్ల జారీకి ఐఐఎఫ్‌సీఎల్ గ్లోబల్ ఈక్విటీ ఫండ్ల నుంచి 14 నెలల్లోనే అత్యధిక వారాంతపు నిధుల ఉపసంహరణ ‘ఐ హేట్ మ్యారేజ్’ మూవీ రివ్యూ: నేటి తరం ప్రేమ, పెళ్లిపై భిన్నమైన కథనం ఎలా ఉందంటే? తిరుప్పరంకుండ్రం దీపం రేపు వెలిగించండి టాటా స్టీల్ - ఏపీఎల్ అపోలో ఒప్పందంపై సెబీ దృష్టి షాంఘై పార్టీ చీఫ్ చెన్ జినింగ్ పతనం ‘డాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ మూవీ రివ్యూ: ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో తెలుసా? దక్షిణాఫ్రికా పోలీసు, న్యాయ వ్యవస్థలోకి సంఘటిత నేర ముఠాల చొరబాటు

సాగర్ హైవేపై దగ్ధమైన ఖరీదైన వోల్వో కారు

Select Suryaa Now
సాగర్ హైవేపై దగ్ధమైన ఖరీదైన వోల్వో కారు

 

తుర్కయంజాల్, మేజర్ న్యూస్.
రాగన్నగూడ సాగర్ హైవేపై కరెంట్ సబ్ స్టేషన్ సమీపంలో ఓ ఖరీదైన వోల్వో కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది.ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని రాగన్నగూడ విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటనతో వాహనదారులు ఆందోళనకు గురయ్యారు.తుక్కుగూడ ఔటర్ రింగ్ రోడ్డు నుండి నాగోల్‌కు వెళ్తున్న వోల్వో కారు (TS 09 ES 8888) సబ్‌స్టేషన్ సమీపానికి చేరుకోగానే పొగలు రావడంతో అప్రమత్తమైన యజమాని వాహనాన్ని రహదారి పక్కన నిలిపివేశారు.కొద్దిసేపటికే మంటలు వ్యాపించడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.అక్కడికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేసినప్పటికీ కారు పూర్తిగా దగ్ధమైంది.కారులో ప్రయాణిస్తున్న వారంతా సురక్షితంగా బయటపడటంతో ప్రాణాపాయం తప్పింది. అయితే ఘటన కారణంగా హైవేపై కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

 

 

ఎడ్ల వెంకటేష్ గౌడ్, మేజర్ న్యూస్, తుర్కయంజాల్.