BREAKING
కస్టడీ పొడిగింపుపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా: ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఉత్తర్వుల సవాలు! గుజరాత్‌లో నాలుగు ఘోర రోడ్డు ప్రమాదాలు: విధుల్లో ఉన్న పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ సహా 11 మంది దుర్మరణం! గ్రేటర్ నోయిడాలో 19వ రెన్యూవబుల్ ఎనర్జీ ఇండియా ఎక్స్‌పో: 1,080 మంది ఎగ్జిబిటర్లతో స్వచ్ఛ ఇంధన సాంకేతికతల ప్రదర్శన! ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణతో కాంగ్రెస్ బెంబేలు: బీజేపీ నేత శ్రీకాంత్ శర్మ తీవ్ర వ్యాఖ్యలు! పలమనేరు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ 33 వార్డుల్లో పోటీ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో మరో కీలక ఘట్టం: 5వ యూనిట్ ట్రయల్ రన్ విజయవంతం వెల్దుర్తి మండల అభివృద్ధికి సుబ్బారాయుడు కుటుంబం కృషి అభినందనీయం ముంబైలోని చారిత్రక గేట్‌వే ఆఫ్ ఇండియాను సందర్శించిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో: 26/11 అమరులకు నివాళి! శ్రీకాకుళం బీచ్‌లో తీవ్ర విషాదం: స్నానానికి వెళ్ళి నలుగురు గల్లంతు కృష్ణానదిలో వైభవంగా దుర్గమ్మ తెప్పోత్సవం: హంస వాహనంపై భక్తులకు అభయమిచ్చిన దుర్గామల్లేశ్వరులు 34వ డివిజన్‌లో సరిపూటి రమణ ప్రచార హోరు.. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థన.. బైరాగి గూడా లో ఘనంగా దసరా వేడుకలు దుర్గామాత సేవలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సంజీవరెడ్డి జానంపేటలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే రేగా ఇంటిపై టి.డి.పి గుండాలదాడి నామినేషన్ తిరస్కరించడంపై పోరెడ్డిని కలిసి రెడ్యం

రూ.6 లక్షల నోట్లతో అమ్మవారి అలంకరణ లక్ష్మీదేవి అవతారంలో దర్శనమిచ్చిన దుర్గామాత

Select Suryaa Now
రూ.6 లక్షల నోట్లతో అమ్మవారి అలంకరణ  లక్ష్మీదేవి అవతారంలో దర్శనమిచ్చిన దుర్గామాత

 

సిద్దిపేట అర్బన్, :దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల మధిర బట్టి రామన్నపల్లి గ్రామంలో దుర్గామాత అమ్మవారు లక్ష్మీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. గ్రామ యువత ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి అమ్మవారిని సుమారు రూ.6 లక్షల విలువైన వివిధ నోట్లతో సుందరంగా అలంకరించారు.లక్ష్మీదేవి అలంకరణలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తి కనబరిచారు. ఈ సందర్భంగా గ్రామ యువకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు సమర్పించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి వివిధ రూపాల్లో అలంకరణలు చేపడుతూ భక్తిభావంతో వేడుకలను నిర్వహిస్తున్నారు.