రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ప్రభుత్వ విప్పు వేముల వీరేశం.
చిట్యాల మండలం గుండ్రంపల్లి సింగిల్ విండో చైర్మన్ గా బండ అంజయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు, ఆయనతోపాటు నూతనంగా ఎన్నికైన 13 మంది డైరెక్టర్లు శుక్రవారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం నూతన చైర్మన్ డైరెక్టర్లను శాలువులతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు, అనంతరం ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా సహకార సంఘాలు పనిచేయాలని కోరారు, రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, పంట రుణాలు, సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు, నూతనంగా ఎన్నికైన సహకార సంఘాన్ని మరింత బలోపేతం చేస్తూ అందుబాటులో ఉండాలని విజ్ఞప్తి చేశారు సంఘం అభివృద్ధికి ఎమ్మెల్యే గా తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.