BREAKING
సెర్బియాలో ఉత్కంఠభరితంగా ముగిసిన సార్వత్రిక ఎన్నికలు కెనరా బ్యాంక్‌కు రూ.212 కోట్ల టోకరా: ఐఎల్‌&ఎఫ్‌ఎస్ ఎనర్జీ, మాజీ డైరెక్టర్లపై సీబీఐ ఎఫ్‌ఐఆర్.. ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్తాన్‌కు భారత్ చురకలు: జమ్మూలో కలకలం.. కోడెడ్ రింగ్, పాకిస్తానీ కరెన్సీ నోటుతో అనుమానాస్పద పావురం లభ్యం: సరిహద్దుల్లో హై అలర్ట్.. బాస్ జాక్ డోర్సే సరికొత్త ఆవిష్కరణ: మానవ సంభాషణలే పునాదిగా ‘డెస్ ఏఐ’ మోడల్ రూపకల్పన.. సాంకేతిక ప్రపంచంలో కొత్త సంచలనం! నూతన వాల్మీకి విగ్రహానికి ముస్తాబైన దొడగట్ట గ్రామం... నూతన వాల్మీకి విగ్రహా ప్రతిష్టాపన... కార్యక్రమంలో పాల్గొనున్న ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాలవ.... ఆండ్రాయిడ్ ఫోన్‌లో స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టండిలా: సింపుల్ సెట్టింగ్స్‌తో పూర్తి రక్షణ! ఏఐ టాలెంట్ వేటలో గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్:అగ్రశ్రేణి ఇంజనీర్ల కోసం బిలియన్ల డాలర్ల ప్యాకేజీలు.. ఎవరి పెట్టుబడులు అత్యధికం? ఆస్ట్రేలియాలో అట్టహాసంగా ప్రారంభమైన సిడ్నీ నూతన అంతర్జాతీయ విమానాశ్రయం బ్లూటూత్ SBC vs AAC vs LDAC: వీటిలో ఏ ఆడియో కోడెక్ అత్యుత్తమం? నాణ్యత, పనితీరులో ప్రధాన తేడాలు ఇవే! సౌదీ అరేబియా రాజధాని రియాద్ విమానాశ్రయంపై హూతీల హెచ్చరికలు తీవ్రతరం కూటమిని ఆదరించి అభివృద్ధికి బాటలు వేయండి : రెండవ వార్డ్ జనసేన అభ్యర్థిని తమ్మిశెట్టి కళావతి అభివృద్ధి ని మరచిన సర్పంచ్ పై చర్యలు చేపట్టాలి...ఉప సర్పంచ్, వార్డు సభ్యుల డిమాండ్ డబుల్ ఇంజిన్ పాలనతో శరవేగంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి : 35 వార్డ్ కూటమి అభ్యర్థిని ఎస్.విద్యాధరి స్పష్టం విశ్వం ఇంజినీరింగ్ కళాశాలలో బిల్డింగ్ ప్లానింగ్,డ్రాయింగ్ అంశంపై వర్క్ షాప్

తెలంగాణలో మళ్లీ వర్షాలు…

Select Suryaa Now
తెలంగాణలో మళ్లీ వర్షాలు…

20 జిల్లాలకు అలర్ట్ జారీ

తెలంగాణలో మళ్లీ ప్రారంభమైన వర్షాలు

రాష్ట్రంలోని 20 జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక

హైదరాబాద్ సహా 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ

గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం

తెలంగాణ బ్యూరో, ప్రతినిధి:

తెలంగాణలో వర్షాలు మళ్లీ పుంజుకున్నాయి. గత రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఈ నేపథ్యంలో, హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేస్తూ.. రాజధాని సహా ఆరు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’, మరో 14 జిల్లాలకు ‘యెల్లో అలర్ట్’ జారీ చేసింది.

వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. మేడ్చల్, నల్లగొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక రాజధాని హైదరాబాద్‌లో మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ప్రమాదం ఉండటంతో యంత్రాంగం అప్రమత్తమై ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతోంది.