రబీ లో ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలి. తాసిల్దార్ నారాయణ.
పెద్ద శంకరంపేట్. : రబి సీజన్లో రైతులు వరి సాగు చేయవద్దని ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని పెద్ద శంకరంపేట తాసిల్దార్ నారాయణ మండల వ్యవసాయ అధికారి నాగం కృష్ణ అన్నారు.. సోమవారం పెద్ద శంకరంపేట లోని ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. రవి సీజన్ కు సంబంధించి వరి విత్తనాలు విక్రయించవద్దని.. వరి విత్తనాలు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.. ఎల్ ని నో ప్రభావంతో తక్కువ వర్షపాతం దృష్టిలో ఉంచుకొని రైతులు వరి సాగుకు దూరంగా ఉండాలని వర్షపాత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అధిక నీటి అవసరం ఉండే వారికి బదులుగా తక్కువ నీటితో సాగు చేసుకునే ఆరు తడి పంటలను సాగు చేయాలని పిలుపునిచ్చారు.. ఎరువుల దుకాణాలలో ఉన్న వరి విత్తనాలను ఆయా కంపెనీలకు తిరిగి పంపించాలని దుకాణ యజమానుదారులకు సూచించారు.. ఎరువులు విత్తనాలకు సంబంధించి పలు రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ నాగరాజు తదితరులు పాల్గొన్నారు...