పైతర గ్రామ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యేకు వినతి: సర్పంచ్ రవితేజ రెడ్డి
కొల్చారం …మెదక్ జిల్లా కొల్చారం మండలం పైతర గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారంతో పాటు నూతన ట్రాన్స్ఫార్మర్, ఓహెచ్ఎస్ఆర్ వాటర్ ట్యాంక్, పెద్ద మురికి కాలువ నిర్మాణం, నూతన అంగన్వాడీ భవనం, ఎస్సీ కమ్యూనిటీ హాల్, కుమ్మరి సంఘం కమ్యూనిటీ హాల్ మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డికి వినతిపత్రం సమర్పించారు. గ్రామంలో మౌలిక వసతులు కల్పించి అభివృద్ధికి సహకరించాలని కోరారు.