మర్రికుంట కట్టపై వేప చెట్ల నరికివేత.. గ్రామస్తుల ఆగ్రహం చెట్లను నరికిన వారెవరు? అధికారుల నిర్లక్ష్యమా?
కొల్చారం …మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్నగనాపూర్ శివారులోని మర్రికుంట కట్టపై వేప చెట్ల నరికివేత వివాదాస్పదంగా మారింది. మెదక్–సంగారెడ్డి ప్రధాన రహదారి పక్కన సాలె వెంకటేశం పొలం సమీపంలోని కుంటకట్టపై చెట్లను నరికివేయడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ భూములు, కుంటకట్టలపై ఉన్న చెట్లను నరికివేస్తున్నా సంబంధిత అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు. చెట్లను ఎవరు నరికించారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. నరికిన చెట్ల దుంగలు, కొమ్మలను కప్పి ఉంచినట్లు స్థానికులు చెబుతున్నారు. అటవీ అధికారులకు విషయం తెలిసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలి