భూ భారతి – భూ రీసర్వేపై అవగాహన
రంగారెడ్డి : మొయినాబాద్ మండలం మోత్కుపల్లి గ్రామంలో భూ భారతి కార్యక్రమంలో భాగంగా భూ రీసర్వేపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) కిరణ్మయి హాజరై, ఏడీఎస్ఎల్ఆర్, చేవెళ్ల ఆర్డీఓ, మొయినాబాద్ తహసీల్దార్, ఎంపీడీఓ, మండల వ్యవసాయ అధికారి (ఎంఏఓ), గ్రామ సర్పంచ్‌తో కలిసి గ్రామసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూ రీసర్వే ప్రాముఖ్యతను గ్రామస్తులకు వివరించారు. భూముల సరిహద్దుల నిర్ధారణ, భూ కొలతల్లో ఖచ్చితత్వం, భూ రికార్డుల నవీకరణ, భూ వివాదాల పరిష్కారంలో రీసర్వే కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. భూ రీసర్వే ప్రక్రియపై గ్రామస్తులకు అవగాహన కల్పిస్తూ, ప్రజలు అధికారులకు సహకరించి తమ భూములకు సంబంధించిన వివరాలను సరిచూసుకోవాలని సూచించారు.
వడ్ల శ్రీనివాస చారి : రంగారెడ్డి - మేజర్ న్యూస్