BREAKING
తెల్లాపూర్‌లో అక్రమ బోర్‌వెల్ కేంద్రాలపై అధికారుల దాడులు జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి యుఏఈలో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి పర్యటన హరిత భారత్ నిర్మాణంలో ప్రధాని మోదీ విజన్ రావులపాలెం మండలంలో చిర్ల జగ్గిరెడ్డి విస్తృత పర్యటన ప్రజాస్వామ్యానికి విభేదాలే నిజమైన బలం..లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా -కర్దనూరు శిశు విహార్ హైస్కూల్‌లో విద్యార్థినులకు అవగాహన సదస్సు సకల ఆత్మల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించిన చిన్నపురి గ్రామస్తులు కూటమి ఐక్యతను దెబ్బతీసేందుకు వైసీపీ కుట్రలు.. అప్రమత్తంగా ఉండాలి ఓట్ల లెక్కింపులో సంయమనం పాటించాలి – ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సాగు భూమి సంరక్షణ కార్యక్రమం అవగాహన కళాశాలల సమీపంలో మద్యం విక్రయాలు! జిల్లాల్లోనే 90 శాతం వైద్య సేవలు అందించాలి! మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాలు మల్లేశ్వర స్వామి సాక్షిగా హామీ ఇస్తున్నా .. సోలక్ పల్లి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ ప్లాస్టిక్ సీసాల్లో నీరు తాగడం ఆరోగ్యానికి ప్రమాదకరమా: నిపుణులు హెచ్చరిస్తున్న నిజాలు ఇవే!

ప్రముఖ బేకరిలో లో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారుల తనిఖీలు

Select Suryaa Now
ప్రముఖ బేకరిలో లో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారుల తనిఖీలు

సూర్య జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా కేంద్రంలోని యావర్ రోడ్డులో గల ఓ ప్రముఖ బేకరీలో టి జి సేఫ్  ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బేకరీలో ఎలాంటి లేబుళ్ళు లేకుండా విక్రయిస్తున్న వాటిని, కలర్ కంటెంట్ ఎక్కువ మోతాదులో కలిపి తయారు చేసిన బేకరీ ఐటమ్ ను సీజ్ చేసినట్టు తెలిసింది. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కలీం ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీలో నిబంధనలు అతిక్రమస్తూ లేబుళ్ళు లేకుండా  తయారు చేసిన వాటిని, తయారు చేసిన తేదీ, ఎక్స్పైరీ తేదీ, బ్యాచ్ నంబర్ లేకుండా విక్రయిస్తున్న పలు రకాల బేకరీ ఐటమ్ ను సీజ్ చేసినట్టు తెలిసింది. ఈ విషయమై అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కలీంను వివరణ కోరగా తనిఖీలను గొప్యంగా ఉంచుతున్నామని, పై అధికారుల అనుమతితో వివరాలు వెల్లడిస్తామన్నారు. అయితే తనిఖిల్లో పెద్ద ఎత్తున బేకరీ ఐటమ్ నిబంధనలకు విరుద్ధంగా తయారు చేస్తున్నట్టు గుర్తించి వాటిని సీజ్ చేసినప్పటికీ వాటి వివరాలు తెలపక పోవడం వెనక మర్మమేమిటో అన్న గుసగుసలు స్థానికంగా వినిపిస్తున్నాయి.