BREAKING
ఘనంగా పిడికిటి గోపాల్ చౌదరి జన్మదిన వేడుకలు సోషల్ మీడియా వారియర్ పిడికిటి గోపాల్ చౌదరి జన్మదినం శనీశ్వర స్వామి ఆలయంలో పోటెత్తిన భక్తులు అమరవీరుల త్యాగాలు మరువలేనివి కాంగ్రెస్ వైఫల్యాలకు తగిన సమాధానం చెప్పాలి పట్టభద్రుల ఎన్నికల పై ఎం.జి.ఆర్. సూచన వేడుకగా శ్రీవారి ఎదుర్కోలు ఉత్సవం రక్తదాన శిబిరం పాకిస్తాన్ టెస్ట్ జట్టు ప్రకటన.. శ్రీలంక సిరీస్‌కు కొత్త ఆటగాళ్లకు పిలుపు దేవరపల్లిని ఆదర్శ గ్రామం గా తీర్చిదిద్దుతా శిల్పా రావుకు అవమానం.. లైవ్ స్టేజ్‌పై మధ్యలోనే పాట ఆపేయడంతో మండిపడుతున్న ఫ్యాన్స్! పెరవలిలో ఎన్నికల వేడి.. 20 ఎంపీటీసీ స్థానాలకు 102 నామినేషన్లు! అత్యధికంగా వైసీపీ నుంచి 39 నామినేషన్లు.. బానసంధ్య దుకాణాలు తనిఖీ చేసిన డిఎస్పి బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన రౌడీ షీటర్‌కు రిమాండ్ ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్లు పరిశీలించిన అధికారులు ఒక నామినేషన్ తిరస్కరణ పోలింగ్ కేంద్రాల్లో వసతుల కల్పనపై దృష్టి సారించాలని ఆదేశం.. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పై పీడీఓలకు.. ఎంపిడిఓ మమత సూచనలు సుమ నా ప్రాణదాత.. కన్నీరు పెట్టుకున్న సీనియర్ నటి సుభాషిణి!

*ప్రజలకు సత్వర పోలీస్ సేవలు*..

Select Suryaa Now
*ప్రజలకు సత్వర పోలీస్ సేవలు*..

*డయల్ 112 ఫిర్యాదులపై తక్షణమే స్పందన*..

*నేరస్థులపై నిరంతర నిఘా.. ఉంచి నేరాల నివారణ*..

*మహిళలకు, బాలలకు సత్వర పోలీస్ సేవల కోసం ప్రత్యేక భవనాల నిర్మాణం*..

*సూర్యాపేట జిల్లా ఎస్పి నరసింహ*..

సూర్యాపేట 

సూర్యాపేట పట్టణ వన్ టౌన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ నరసింహ ఆకస్మికంగా శనివారం తనిఖీ చేశారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందిస్తూ, ప్రతి ఫిర్యాదుపై నిర్ణీత సమయంలో స్పందించాలని, అత్యవసర పరిస్థితుల్లో సంఘటనా స్థలానికి వెంటనే చేరుకొని బాధితులకు సహాయం అందించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ పోలీస్ అధికారులకు, సిబ్బందికి సూచించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఒకటవ, రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ నరసింహ  ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లలోని వివిధ విభాగాలను, కేసులకు సంబంధించిన స్వాధీన సామగ్రిని, రిసెప్షన్ సెంటర్ల పనితీరును పరిశీలించి, ప్రజలకు అందిస్తున్న సేవలపై సమీక్ష నిర్వహించారు. పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్, షీ టీమ్ భవన నిర్మాణ పనులను కూడా పరిశీలించారు.

*స్వాధీన సామగ్రిని సక్రమంగా నిర్వహించాలి..*

పోలీస్ స్టేషన్ల పరిసరాల్లో నేరాలకు సంబంధించిన కేసుల్లో స్వాధీనం చేసుకున్న సామగ్రిని పరిశీలించారు. స్వాధీన సామగ్రిని నిబంధనల ప్రకారం భద్రపరచాలని, వాటికి సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. కేసుల దర్యాప్తులో అవసరమైన ఆధారాలు, వస్తువుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు.

*ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్, షీ టీమ్ భవన నిర్మాణాల పరిశీలన..*

పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్, షీ టీమ్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ కేంద్రాల ద్వారా ప్రజలకు, కుటుంబ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి, మహిళలకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. మహిళలు తమ సమస్యలను నిర్భయంగా పోలీసుల దృష్టికి తీసుకువచ్చేలా అనుకూల వాతావరణాన్ని కల్పించాలని, మహిళల భద్రతకు సంబంధించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని తెలిపారు.

*రిసెప్షన్ సెంటర్ల పనితీరు మెరుగుపరచాలి..*

పోలీస్ స్టేషన్లలో నిర్వహిస్తున్న రిసెప్షన్ సెంటర్లను, ఫిర్యాదుదారుల నుంచి పిటిషన్లు స్వీకరిస్తున్న విధానం, వాటిని నమోదు చేస్తున్న తీరు, సంబంధిత అధికారులకు పంపించడం, పరిష్కారానికి తీసుకుంటున్న చర్యల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడితో మర్యాదగా వ్యవహరించాలని, వారి సమస్యలను ఓపికగా విని, ఫిర్యాదులను సక్రమంగా నమోదు చేసి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధితులు తమ సమస్యల పరిష్కారం కోసం పదేపదే పోలీస్ స్టేషన్లకు రావాల్సిన పరిస్థితి లేకుండా చూడాలని తెలిపారు.

*పిటిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను పటిష్టంగా అమలు చేయాలి..*

పోలీస్ స్టేషన్లలో అమలవుతున్న పిటిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ పనితీరును సమీక్షించారు. ప్రజల నుంచి అందిన ప్రతి ఫిర్యాదును సక్రమంగా నమోదు చేసి, సంబంధిత అధికారులకు కేటాయించి, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రతి ఫిర్యాదుపై నిర్ణీత సమయంలో స్పందించి, పూర్తిస్థాయిలో విచారణ జరపాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.

*మీసేవ ఫిర్యాదులపై నిర్ణీత సమయంలో స్పందించాలి*

మీసేవ ద్వారా అందిన ఫిర్యాదులు, దరఖాస్తులపై అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. నిర్ణీత సమయంలో స్పందించి, అవసరమైన విచారణ పూర్తి చేసి, సంబంధిత సేవలు, ధ్రువపత్రాలు అర్హులైన పౌరులకు సకాలంలో అందేలా కృషి చేయాలని ఆదేశించారు. ప్రజలకు అందించే సేవల్లో అనవసరమైన జాప్యం జరగకుండా చూడాలని, ప్రతి దరఖాస్తును బాధ్యతతో పరిశీలించి, నిబంధనల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

*డయల్ 112 ఫిర్యాదులపై తక్షణ స్పందన తప్పనిసరి*

డయల్ 112 ద్వారా పగలు లేదా రాత్రి వచ్చే అత్యవసర ఫిర్యాదులపై బ్లూకోల్ట్స్, పెట్రోలింగ్ సిబ్బంది, ఎస్‌ఎస్‌ఓ నియమించిన సిబ్బంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా సంఘటనా స్థలానికి చేరుకోవాలని సూచించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న వెంటనే పరిస్థితిని అంచనా వేసి, పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని, తదుపరి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని తెలిపారు. పరిస్థితిని బట్టి అదనపు పోలీస్ బలగాలు అవసరమైతే వెంటనే రప్పించుకొని శాంతిభద్రతలను కాపాడాలని ఆదేశించారు. అత్యవసర ఫిర్యాదుల విషయంలో సమయపాలన అత్యంత కీలకమని, బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డయల్ 112 ద్వారా అందిన ఫిర్యాదులపై స్పందన, సంఘటనా స్థలానికి చేరుకునే సమయం, తీసుకున్న చర్యల విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు.

*నేరస్థులపై నిరంతర నిఘా ఉంచాలి..*

బ్లూకోల్ట్స్, పెట్రోలింగ్ సిబ్బంది తమ పరిధిలోని రౌడీషీటర్లు, గంజాయి నేరాలకు పాల్పడే వ్యక్తులు, సైబర్ నేరగాళ్లు, దొంగతనాలకు పాల్పడే వ్యక్తులు, ఇతర అసాంఘిక శక్తులపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. నేరాలు జరిగిన తర్వాత స్పందించడమే కాకుండా, నేరాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించి, నిబంధనల ప్రకారం తగిన చర్యలు చేపట్టాలని, సంబంధిత వ్యక్తుల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నిరంతర పెట్రోలింగ్ నిర్వహిస్తూ, నేరాలకు అవకాశం ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ప్రజల భద్రతకు భంగం కలగకుండా, శాంతిభద్రతల పరిరక్షణకు సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.

*ప్రజలకు అత్యవసర సేవలు అందించడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం..*

ప్రజలకు అత్యవసర సేవలు అందించడం, వారి సమస్యలను పరిష్కరించడం, బాధితులకు న్యాయం జరిగేలా చూడటం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రతి ఒక్కరికీ గౌరవప్రదమైన సేవలు అందించాలని, ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా చట్టపరిధిలో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన, ఫిర్యాదుల పరిష్కారంలో పారదర్శకత, నేరాల నివారణలో ముందస్తు చర్యలు పోలీస్ విధుల్లో కీలకమని తెలిపారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రతి అధికారి, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని, నిరంతర నిఘా, సమర్థవంతమైన పెట్రోలింగ్, సత్వర స్పందన ద్వారా ప్రజల్లో పోలీస్ శాఖపై విశ్వాసాన్ని మరింత పెంపొందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ఎస్ఐ గోపీకృష్ణ, ఎస్ఐ సురేష్, పట్టణ సిబ్బంది అన్నారు.