telangana
ప్రజావాణికి మూడు దరఖాస్తులు
సూర్య , పెంచికల్‌పేట్:పెంచికల్‌పేట్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ఎంపీడీవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోరుతూ మూడు దరఖాస్తులను అధికారులకు అందజేశారు.వీటిలో రహదారి సమస్యపై ఒకటి, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఒకటి, రెవెన్యూ సమస్యపై మరొకటి దరఖాస్తు అందాయి. ప్రజలు తమ సమస్యలను ప్రజావాణి ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో శ్రీనివాస్ సూచించారు. స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.