BREAKING
మైనింగ్‌ స్టాఫ్‌ డిమాండ్లను పరిష్కరించాలి - వాసిరెడ్డి సీతారామయ్య సేవా మూర్తులకు బీజేపీ సన్మానం సింగరేణి పెన్షనర్లకు సౌకర్యవంతంగా డీఎల్‌సీ రెన్యూవల్ సేవలు - తొలిరోజు 185 మందికి సేవలు కృష్ణానదిలో వలలో చిక్కుకుని మత్స్యకారుడి మృతి ఉల్లిపాలెంలో విషాదఛాయలు.. కుటుంబ సభ్యుల రోదనలు వార్షిక గది ఆదాయ వృద్ధి అంచనాలను పెంచిన మేరియట్ ఇంటర్నేషనల్ మంగి గ్రామానికి బస్సు సేవలు ప్రారంభం - గ్రామస్తుల హర్షం సాయి కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలోడ్రంక్ అండ్ డ్రైవ్ పై ఉక్కు పాదం-ఇద్దరికీ జైలు ముగ్గురికి జరిమానా ఇరాన్‌పై డోనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు..గల్ఫ్ దేశాలలో మళ్లీ రాజుకుంటున్న యుద్ధ భయాలు పాఠశాలల్లో అల్పాహారం ప్రారంభం ఆపదలో ఉన్న రైతుకు అండగా నిలిచిన చైతన్య కిరణ్ ఎల్ నినో దృష్ట్యా విద్యుత్తును పొదుపు చేయండి... హంగేరి రాజకీయాల్లో కొత్త చీఫ్ ప్రాసిక్యూటర్ అభ్యర్థికి మద్దతు తెలిపిన అధికార పార్టీ ఉద్యోగులు విధి నిర్వహణతో పాటు తమ ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా. 'సెంపాయింట్ పార్టనర్స్' పేరుతో కొత్త ప్రాక్సీ సొలిసిటింగ్ సంస్థను ప్రారంభించిన అనుభవజ్ఞులు వర్షాభావంపై క్షేత్రస్థాయి పరిశీలన తుగ్గలి మండలంలో కేంద్ర కరువు బృందం పర్యటన రైతులతో ముఖాముఖి.. పంట నష్టాల అంచనా

ప్రజావాణి దరఖాస్తులకు సత్వర పరిష్కారం చూపాలి - జిల్లా కలెక్టర్ రాజర్షి షా

Select Suryaa Now
ప్రజావాణి దరఖాస్తులకు సత్వర పరిష్కారం చూపాలి - జిల్లా కలెక్టర్ రాజర్షి షా
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : ప్రజావాణి ద్వారా ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి, నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి స్వయంగా అర్జీలను స్వీకరించారు. ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, ఉపాధి హామీ పథకం, భూభారతి తదితర అంశాలకు సంబంధించి కలెక్టరేట్ స్థాయిలో 64, మండల స్థాయిలో 52 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు.అందిన ప్రతి ఫిర్యాదుపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని, శాఖల మధ్య సమన్వయంతో సమస్యలను పరిష్కరించాలని సూచించారు. మండల స్థాయిలో ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఇతర శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. తీసుకున్న చర్యలు, పరిష్కార వివరాలను నిర్ణీత గడువులోగా ప్రజావాణి పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించారు.ఒకే సమస్యపై ప్రజలు పదేపదే కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదని, సమస్యల మూలాలను గుర్తించి శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.బోరజ్ మండలం మాండగడ గ్రామంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న వంతెన నిర్మాణం, స్థానిక పాఠశాలకు అదనపు షెడ్డు నిర్మాణ పనులు జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో పూర్తయ్యాయి. వంతెన నిర్మాణంతో గ్రామస్థుల రాకపోకల కష్టాలు తీరగా, పాఠశాలలో అదనపు షెడ్డు ఏర్పాటు కావడంతో విద్యార్థులకు మౌలిక వసతులు మెరుగుపడ్డాయి. గ్రామ సమస్యలపై సానుకూలంగా స్పందించి, నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చేయించిన కలెక్టర్‌కు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బాధ రవీందర్, ఉప సర్పంచ్ మామిడి వెంకటరెడ్డి, గ్రామ పెద్ద నర్రా విఠల్ తదితరులు కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.అనంతరం భగవాన్ బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని నిర్వహించే జనజాతీయ గౌరవ దివస్ వేడుకలను జిల్లావ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు పిలుపునిచ్చారు.సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జనజాతీయ గౌరవ దివస్ ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లు, కార్యక్రమాల షెడ్యూల్‌ను ఆయన విడుదల చేశారు. నవంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించే ఈ వేడుకల్లో భాగంగా గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, స్వాతంత్ర్య పోరాటంలో వారు చేసిన త్యాగాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.పాఠశాలలు, కళాశాలలు, గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన, ఉపన్యాస, సాంస్కృతిక పోటీలు నిర్వహించాలని విద్యా, గిరిజన సంక్షేమ, వైద్య ఆరోగ్య శాఖల అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఉత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ ఆర్.ఎస్. చిత్రు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జెడ్పీ సీఈవో రవి, డీఆర్డీఏ అధికారి రవీందర్ రాథోడ్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.