BREAKING
ప్రజావాణికి ఒకే ఒక్క దరఖాస్తు ఎంపీడీవో జయరాం విజయ్ నిరుపేదలకు వరం ముఖ్యమంత్రి సహాయ నిధి ఆంత్రోపిక్‌కు షాక్...'క్లాడ్' సబ్‌స్క్రిప్షన్ మార్కెటింగ్ వివాదంపై కోర్టులో కొనసాగనున్న వ్యాజ్యం ఫ్రాన్స్‌లో స్మార్ట్ రిఫ్రిజిరేటర్లపై సైబర్ దాడి కలకలం హరిత భవిష్యత్తుకు గ్రిడ్లు, ఫైనాన్స్, ఉద్యోగ కల్పనే కీలకం అమెరికాలో పెరుగుతున్న నిరుద్యోగ భయాలు డ్రోన్ ముప్పును తిప్పికొట్టేందుకు అమెరికా కీలక నిర్ణయం అమెరికాలో హోండా ఓహియోలో రూ.25 వేల కోట్లతో కొత్త ఆటో ప్లాంట్ కుంభ రాశి వారఫలాలు | 08 NOV 2026 - 14 NOV 2026 | Aquarius Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani పోలాండ్‌లోని క్రాకోవ్ నగరంలో కాల్పుల ఘటన...దిగ్భ్రాంతిలో దేశ ప్రజలు ఈయూ బడ్జెట్‌లో పర్యవేక్షణ తగ్గిస్తే సహించేది లేదు యంగ్ హీరో రోషన్ మేకతో దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ క్రేజీ ప్రాజెక్ట్.. జటాయుగా రానున్న విజువల్ వండర్ యూరోపియన్ యూనియన్ నుంచి యూనిక్రెడిట్‌కు ఊరట మీన రాశి వారఫలాలు | 08 NOV 2026 - 14 NOV 2026 | Pisces Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani దేశవ్యాప్తంగా ఘనంగా ‘దీపావళి స్నేహ్ మిలన్’

ప్రైవేట్ చిట్టీల పేరుతో రూ.55.33 లక్షల టోకరాా..

Select Suryaa Now
ప్రైవేట్ చిట్టీల పేరుతో రూ.55.33 లక్షల టోకరాా..

​కొత్తగూడెం క్రైమ్, సూర్య (మేజర్ న్యూస్) అధిక లాభాల ఆశచూపి, ప్రైవేట్ చిట్టీల పేరుతో అమాయక ప్రజలను మోసగించిన ముగ్గురు నిందితులను కొత్తగూడెం త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ వెల్లడించారు. సోమవారం స్థానిక త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  కొత్తగూడెం పట్టణంలోని న్యూ గొల్లగూడెంకు చెందిన కట్టుల సరోజ, కట్టుల చంద్రకళ, కట్టుల కుమార్ అనే ముగ్గురూ కలిసి ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా మొత్తం 11 ప్రైవేట్ చిట్టీలను నిర్వహించారని తెలిపారు. వివిధ వర్గాల ప్రజల నుంచి విడతలవారీగా ఏకంగా రూ.55,33,745 వసూలు చేశారన్నారు. అయితే, గడువు ముగిసిన తర్వాత ఖాతాదారులకు డబ్బులు చెల్లించకుండా నిందితులు కాలయాపన చేస్తూ వచ్చారని, బాధితుల ఫిర్యాదు మేరకు కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 188/2026 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపటైనట్లు తెలిపారు.  సోమవారం కొత్తగూడెం రైల్వే స్టేషన్ ప్రాంతంలో నిందితులు సంచరిస్తున్నట్లు త్రీ టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డికి పక్కా సమాచారం అందడంతో, ఆయన సిబ్బందితో కలిసి వెంటనే అప్రమత్తమై ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి చిట్టీల లావాదేవీలకు సంబంధించిన ఐదు రికార్డు పుస్తకాలను (బుక్స్) స్వాధీనం చేసుకున్నారని వివరించారు. అనంతరం అరెస్ట్ చేసిన ముగ్గురు నిందితులను న్యాయస్థానం ఎదుట హాజరుపరిచినట్లు వెల్లడించారు.
​