పర్ణశాలలో వైభవంగా సీతారాముల కల్యాణం.
పర్ణశాలలో వైభవంగా సీతారాముల కల్యాణం.
దుమ్ముగూడెం సూర్య (మేజర్ న్యూస్)::
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి అనుబంధ ఆలయమైన పర్ణశాల దేవాలయంలో ఆదివారం పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామివారి కల్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు.ఉదయం సుప్రభాత సేవ, తిరువారాధన, తిరుమంజనం అనంతరం 10:30 గంటలకు కల్యాణ ఘట్టం ప్రారంభమైంది. అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, మాంగల్యధారణ మంత్రోచ్ఛారణల నడుమ కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.అనంతరం మధ్యాహ్నం రాజభోగ నివేదన చేసి భక్తులకు విశేష ప్రసాద వితరణ చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఇన్‌ఛార్జ్ వాసు, అర్చకులు,సిబ్బంది పాల్గొన్నారు.