BREAKING
ఓటీటీలోకి సరికొత్త హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఫ్రీగా చూసేయండిలా! రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేసిన సర్పంచ్ శాంతి కిషన్ నాయక్ కరువు నివారణ చర్యలపై అధికారుల దృష్టి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్‌ దుస్తుల పంపిణీ అభినందనీయం: పీఏసీఎస్‌ చైర్మన్‌ మన్నె శంకర్‌ యాదవ్‌ సంచలన దర్శకుడు శ్రీకాంత్ ఓడెల కొత్త సినిమా.. ఆసక్తికరమైన బ్యాక్‌డ్రాప్‌లో లవ్ స్టోరీ! ఈనెల 30 నుంచి పుష్కర బ్రహ్మోత్సవాలు నేటి నుంచి వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలు పోలీసు అమరవీరుల త్యాగం చిరస్మరణీయం-సీఐ పవన్ కుమార్ డబ్ల్యూపీఎల్ 2027 వేలం.. ఆస్ట్రేలియా ప్లేయర్‌కు భారీ ధర, ఎవరెవరు ఏ జట్టుకంటే? పసునూరి నాగేశ్వర్ మృతి ఈరవెన్ను గ్రామానికి తీరని లోటు అలియాబాద్‌ 18, 19వ వార్డుల్లో లో వోల్టేజ్‌ సమస్యకు చెక్‌.. 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుకు భూమిపూజ హాలీవుడ్ సంచలనం.. మళ్లీ క్యాట్నిస్‌గా జెన్నిఫర్ లారెన్స్ రీఎంట్రీ నల్లబెల్లి ని కరువు మండలం గా ప్రకటించాలి షఫాలీ వర్మ విధ్వంసకర హాఫ్ సెంచరీ.. జింబాబ్వేపై భారత్ క్లీన్ స్వీప్ న్యూజిలాండ్‌తో చివరి రెండు టీ20లకు ఇషాన్ కిషన్ రీఎంట్రీ.. తుది జట్టులో ఆ యువ ఆటగాడికి స్థానం దక్కేనా..?

చెక్కగానుగ నూనెలతో ఆరోగ్య పరిరక్షణకు బాటలు!

Select Suryaa Now
చెక్కగానుగ నూనెలతో ఆరోగ్య పరిరక్షణకు బాటలు!

700కు పైగా యూనిట్ల ఏర్పాటుకు శిక్షణ.. స్వదేశీ ఉత్పత్తులకు ప్రోత్సాహం

చౌటుప్పల్, మేజర్ న్యూస్:సంప్రదాయ చెక్కగానుగ నూనెల తయారీని ప్రోత్సహిస్తూ స్వదేశీ ఉత్పత్తుల విస్తరణకు కృషి చేస్తున్న బస్వరాజు పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఖాదర్‌వలి శిష్యుడైన ఆయన 2016లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సమయంలో ఎదురైన ఓ అనుభవం నేపథ్యంలో సహజసిద్ధమైన నూనెల తయారీపై దృష్టి సారించారు. నిత్యావసరమైన వంటనూనెల తయారీ విధానాలపై పరిశోధించి, ఎద్దుల గానుగతో తయారుచేసే సంప్రదాయ నూనెల ప్రాధాన్యాన్ని ప్రజలకు పరిచయం చేశారు. ఈ క్రమంలో పలువురికి శిక్షణ ఇచ్చి రాష్ట్రవ్యాప్తంగా 700కు పైగా చెక్కగానుగ యూనిట్ల ఏర్పాటుకు తోడ్పడ్డారు.

ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్‌ జిల్లాలోని స్వదేశీ ఉత్పత్తుల కేంద్రాన్ని ఫిజియోథెరపిస్ట్‌ డాక్టర్‌ గుండెబోయిన రమేష్‌ యాదవ్‌ సందర్శించి బస్వరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. చెక్కగానుగ యూనిట్ల విస్తరణ, స్వదేశీ ఉత్పత్తుల ప్రోత్సాహానికి తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు.

*సంప్రదాయ పద్ధతులే ఆరోగ్యానికి మేలు*

ఈ సందర్భంగా బస్వరాజు మాట్లాడుతూ.. సంప్రదాయ పద్ధతుల్లో తయారయ్యే నూనెలపై ప్రజల్లో అవగాహన పెంచడం, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం తమ లక్ష్యమన్నారు. యువతకు శిక్షణ అందించి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో చెక్కగానుగ యూనిట్లను మరింత విస్తరించేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు.కార్యక్రమంలో రంగారాజు లక్ష్మినర్సింహా రావు పాల్గొన్నారు.