telangana
నిరుపేదలకు ఉచిత కంటి శస్త్రచికిత్సలు చేసిన ఎమ్మెల్యే
సూర్య జగిత్యాల ప్రతినిధి జగిత్యాల పవని కంటి ఆసుపత్రిలో ఆపి, రోటరీ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన 9 మంది నిరుపేదలకు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు నిర్వహించారు. శస్త్రచికిత్సలు చేయించుకున్న నిరుపేదలకు ఉచితంగా కంటి అద్దాలు, మందులను అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు టీవీ సూర్యం, డాక్టర్ విజయ్, ఆసుపత్రి సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.