BREAKING
ఘనంగా పిడికిటి గోపాల్ చౌదరి జన్మదిన వేడుకలు సోషల్ మీడియా వారియర్ పిడికిటి గోపాల్ చౌదరి జన్మదినం శనీశ్వర స్వామి ఆలయంలో పోటెత్తిన భక్తులు అమరవీరుల త్యాగాలు మరువలేనివి కాంగ్రెస్ వైఫల్యాలకు తగిన సమాధానం చెప్పాలి పట్టభద్రుల ఎన్నికల పై ఎం.జి.ఆర్. సూచన వేడుకగా శ్రీవారి ఎదుర్కోలు ఉత్సవం రక్తదాన శిబిరం పాకిస్తాన్ టెస్ట్ జట్టు ప్రకటన.. శ్రీలంక సిరీస్‌కు కొత్త ఆటగాళ్లకు పిలుపు దేవరపల్లిని ఆదర్శ గ్రామం గా తీర్చిదిద్దుతా శిల్పా రావుకు అవమానం.. లైవ్ స్టేజ్‌పై మధ్యలోనే పాట ఆపేయడంతో మండిపడుతున్న ఫ్యాన్స్! పెరవలిలో ఎన్నికల వేడి.. 20 ఎంపీటీసీ స్థానాలకు 102 నామినేషన్లు! అత్యధికంగా వైసీపీ నుంచి 39 నామినేషన్లు.. బానసంధ్య దుకాణాలు తనిఖీ చేసిన డిఎస్పి బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన రౌడీ షీటర్‌కు రిమాండ్ ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్లు పరిశీలించిన అధికారులు ఒక నామినేషన్ తిరస్కరణ పోలింగ్ కేంద్రాల్లో వసతుల కల్పనపై దృష్టి సారించాలని ఆదేశం.. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పై పీడీఓలకు.. ఎంపిడిఓ మమత సూచనలు సుమ నా ప్రాణదాత.. కన్నీరు పెట్టుకున్న సీనియర్ నటి సుభాషిణి!

నిజాంపేటలో మండల స్థాయి సమీక్ష సమావేశం..

Select Suryaa Now
నిజాంపేటలో మండల స్థాయి సమీక్ష సమావేశం..

రామాయంపేట;నిజాంపేట మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఇన్‌చార్జి ఎంపీడీవో ముజాహిద్దీన్ ఆధ్వర్యంలో మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల స్పెషల్ అధికారి దేవకుమార్ ముఖ్య అతిథిగా హాజరై వివిధ శాఖల అధికారులతో అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు.ఈ సందర్భంగా స్పెషల్ అధికారి దేవకుమార్ మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో మండలంలోని రైతులు వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. గ్రామాల్లో ప్రజలు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని కోరారు.చల్మెడ నుంచి నందగోకుల్ వరకు, చౌకత్‌పల్లి నుంచి ధర్మారం వరకు, ఖాసీంపూర్ నుంచి తిప్పనగుల్ల వరకు రహదారి పనులకు నిధులు మంజూరైనప్పటికీ, కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు నిలిచిపోయాయని ఆర్‌అండ్‌బీ ఏఈ తెలిపారు.ఈ సమావేశంలో మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి, మిషన్ భగీరథ ఏఈ బిక్షపతి, ఎంఈఓ యాదగిరి, ఏపీఎం అశోక్, విద్యుత్ శాఖ ఏఈ గణేష్, సీనియర్ అసిస్టెంట్ కరీముల్లా, సర్పంచులు భాను ప్రకాశ్‌రెడ్డి, బొమ్మన మల్లేశం, రామ్‌చందర్ నాయక్, కనకరాజు, ప్రవీణ్‌కుమార్, ఆకుల స్వప్న, అంజమ్మ, మంజుల, వివిధ గ్రామాల కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.