నీటి సంరక్షణ చర్యలను చేపట్టాలి - మండల పంచాయతీ అధికారి
సూర్య- బిక్కనూర్ : నీటి సంరక్షణ చర్యలను ప్రతి ఒక్కరూ చేపట్టాలని, మండల పంచాయతీ అధికారి రాజ్ కిరణ్ రెడ్డి చెప్పారు. గురువారం మండల కేంద్రంలో స్థానిక పాత హరిజనవాడలో నిర్మిస్తున్న ఇంకుడు గుంతలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీఓ మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని, నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని, తమ ఇంటి పరిసర ప్రాంతాలలో ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యా నిర్వహణ అధికారి మహేష్ గౌడ్ ఉన్నారు