మణుగూరులో ఓపెన్ హౌస్..పోలీసు స్టేషన్ పనితీరును వివరించిన సి ఐ నాగబాబు
మణుగూరు ఆర్ సి సూర్య ; భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచనల మేరకు మణుగూరు డి ఎస్పీ వి. రవీంద్ర రెడ్డి ఆధ్వర్యంలో గురువారం మణుగూరు పోలీస్ స్టేషన్‌లో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పాఠశాల విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పోలీస్ స్టేషన్ పనితీరు, పోలీసుల విధులు, బాధ్యతలు మరియు శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర గురించి సి ఐ నాగబాబు వివరించారు. అలాగే పోలీస్ శాఖలో ఉపయోగించే వివిధ పరికరాలను విద్యార్థులకు చూపించి, వాటి పనితీరును పోలీసులు వివరించారు.
పొనగంటి కృష్ణ మణుగూరు ఆర్ సి సూర్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా