మల్కాజిగిరిలో ఘనంగా దేవీ నవరాత్రులు: కాలనీల మండపాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత జీఎన్‌వీ సతీష్ కుమార్ ప్రత్యేక పూజలు!
సూర్య సిటీ డెస్క్, మల్కాజిగిరి: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలోని పలు కాలనీలలో భక్తిశ్రద్ధలతో కొలువుదీరిన దుర్గామాత మండపాలు ఆధ్యాత్మిక శోభతో విలసిల్లుతున్నాయి. ఈ సందర్భంగా ఆయా కాలనీలలో ఏర్పాటు చేసిన దేవీ మండపాలను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జీఎన్‌వీ సతీష్ కుమార్ సందర్శించారు.
మండపాలకు విచ్చేసిన ఆయన జగన్మాతకు నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొని హారతి ఇచ్చి అమ్మవారి తీర్థప్రసాదాలు, ఆశీస్సులు అందుకున్నారు. మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలందరిపై దుర్గాదేవి కటాక్షం ఉండాలని, కాలనీవాసులంతా సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా ఆయన ప్రార్థించారు. యువత, కాలనీ సంక్షేమ సంఘాల సభ్యులు భక్తిప్రపత్తులతో ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఆయా దేవీ మండపాల నిర్వాహకులు జీఎన్‌వీ సతీష్ కుమార్‌ను శాలువాతో ఘనంగా సత్కరించి సన్మానించారు. ఈ పూజా కార్యక్రమాల్లో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కాలనీ పెద్దలు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.