మహిళా మోర్చా నాయకురాళ్లకు చీరల పంపిణీ చేసిన రవికుమార్ యాదవ్
కొండాపూర్,మేజర్ న్యూస్ : విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీజేపీ మహిళా మోర్చా నాయకురాళ్లు, కార్యకర్తలకు సోమవారం రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి, నియోజకవర్గ ఇన్‌చార్జి రవికుమార్ యాదవ్ దసరా కానుకగా చీరలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దసరా, బతుకమ్మ పండుగలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి, సమాజ హితం కోసం క్షేత్రస్థాయిలో కృషి చేస్తున్న మహిళా కార్యకర్తలు పార్టీకి వెన్నెముక వంటివారని అన్నారు. పండుగ వేళ మహిళలకు చీరలు అందజేయడం ఆనందంగా ఉందన్నారు. విజయదశమి ప్రజలందరి జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి పద్మ, అనూష యాదవ్, నాయకురాళ్లు వినయ, శారద, మహేశ్వరి, శోభ, సరోజ, విజయలక్ష్మి, నాయకులు మహేష్ యాదవ్, ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.