మహాదుర్గాదేవి అవతారంలో దర్శనమిస్తున్న అమ్మవారు
01 సూర్య కరీంనగర్ ప్రతినిధి శ్రీదేవి నవరాత్రోత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు ఆదివారం శ్రీ మహాదుర్గాదేవి మహాగౌరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవార్ల దివ్య దర్శనంతో ఆలయంలో భక్తిభావం వెల్లివిరిసింది. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.