BREAKING
అభివృద్ధి పనులు చేపట్టేలా మంత్రిని కోరిన నల్లూరి కృష్ణమోహన్.. కరాటం సోంబాబుని పరామర్శించిన మంత్రి దుర్గేష్.. నాగారంలో భక్తిశ్రద్ధలతో శరన్నవరాత్రులు: శ్రీరామ్‌ యూత్ అసోసియేషన్ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు కందాడి అంజిరెడ్డి తోటకూర వజ్రేష్ యాదవ్ కు  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తుంకి రమేష్ అర్హులకే ఇందిరమ్మ ఇళ్ళను కేటాయించాలని ప్రజావాణిలో వినతి రామచంద్రపురం అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను గెలిపించండి :మంత్రి వాసంశెట్టి సుభాష్ యాచారం గ్రామంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. అనంతపురం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఘనంగా ఆయుధ పూజ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ధర్మకర్తపై దాడికి యత్నం ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపికలో పార్టీలకు కొరత - రిజర్వేషన్లతో మారిన రాజకీయ సమీకరణాలు .. ఎంపీపీ పదవిపై నేతల గురి అంత్యక్రియలలో పాల్గొన్న ఎమ్మెల్యే. సంజీవరెడ్డి పసి బిడ్డ ప్రాణాల కోసం తల్లిదండ్రుల ఆరాటం - దాతల ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు అలరించిన చిన్నారుల నృత్య ప్రదర్శన దుర్గాదేవి, వనదుర్గాదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు బతుకమ్మ వేడుకలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పద్మహాదేవేందర్ రెడ్డి 25వ డివిజన్ కార్పొరేటర్ గా పూజారి రాజారాం ఏకగ్రీవం వృత్తి నైపుణ్యాభివృద్ధికి పది రోజుల ఇంటర్న్‌షిప్‌ - ఫ్యాషన్‌ డిజైనింగ్‌, మగ్గం పనిలో విద్యార్థులకు ప్రత్యక్ష శిక్షణ.

మాదాపూర్‌లో యూనిస్ట్రింగ్‌ టెక్‌ సొల్యూషన్స్‌ సంస్థలో అగ్నిప్రమాదం

Select Suryaa Now
మాదాపూర్‌లో యూనిస్ట్రింగ్‌ టెక్‌ సొల్యూషన్స్‌ సంస్థలో అగ్నిప్రమాదం

మాదాపూర్,మేజర్ న్యూస్ :  మాదాపూర్‌ ఖానామెట్‌ ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎన్‌ కన్వెన్షన్‌ సమీపంలోని యూనిస్ట్రింగ్‌ టెక్‌ సొల్యూషన్స్‌ సంస్థలో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తుమ్మిడికుంట వెనుక భాగంలో ఉన్న సంస్థలో మంటలు వ్యాపించడంతో ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మాదాపూర్‌, కూకట్‌పల్లి అగ్నిమాపక కేంద్రాల నుంచి మూడు అగ్నిమాపక వాహనాలను రప్పించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. 

ప్రస్తుతం పొగ వెలువడుతుండటంతో సిబ్బంది పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.యూనిస్ట్రింగ్‌ టెక్‌ సొల్యూషన్స్‌ సంస్థ రక్షణ రంగానికి అవసరమైన ఎలక్ట్రానిక్స్‌, రాడార్‌, ఎలక్ట్రానిక్‌ వార్‌ఫేర్‌ సాంకేతిక ఉత్పత్తులను సరఫరా చేస్తున్నట్లు సమాచారం. డ్రోన్లను గుర్తించి అడ్డుకునే వ్యవస్థల తయారీ, సరఫరాతో పాటు రక్షణ రంగానికి సంబంధించిన సాంకేతిక కార్యకలాపాలు ఇక్కడ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదంలో జరిగిన ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు కూడా వెల్లడికావాల్సి ఉంది. ఘటనపై సంబంధిత అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.