మా కూతురు దివ్య మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణం.ఈ సి. ఐ. ఎల్., శ్రీకర రాఘవేంద్ర ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని తల్లితండ్రుల డిమాండ్
హైదరాబాద్ /ఆల్వాల్,యాప్రాల్ మేజర్ న్యూస్ : మా కూతుఫు దివ్య మృతికి ఈ. సి. ఐ. ఎల్ లోని శ్రీ రాఘవేంద్ర శ్రీ ఖరారు ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని తల్లి తండ్రులు ఆరోపించారు.సైనికపురిలో నివాసముంటున్న గండు శ్రీనివాస్ యాదవ్, మాధవి దంపతుల ఏకైక కుమార్తె దివ్య బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసింది. మూడు రోజుల క్రితం జ్వరం రావడంతో ఆమెను ఈసీఐఎల్‌లోని శ్రీకర రాఘవేంద్ర ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం ఈ నెల 12 న చేర్పించడం జరిగిందని తల్లి తండ్రులు తెలిపారు.
ఈ నెల 13 న ,శ్రీ ఖర ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమార్తె ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేశారు.0సరైన వైద్యం అందించకపోవడం, తప్పుడు చికిత్స అందించడం వల్ల దివ్య ఆరోగ్య పరిస్థితి విషమించి, కాలేయం, గుండె, మెదడు వంటి కీలక అవయవాలు తీవ్రంగా దెబ్బతిని మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, అసలు ఏం జరిగిందో ప్రజలకు తెలియజేయాలని వారు డిమాండ్ చేశారు.
ఒక సాధారణ జ్వరంతో ఆసుపత్రిలో చేరిన యువతి ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని, ఈ ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తక్షణమే స్పందించాలని కుటుంబ సభ్యులు కోరారు. ఆసుపత్రిలో అందించిన చికిత్స, ఉపయోగించిన మందులు, వైద్యుల వ్యవహారశైలిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.ఈ ఘటన నేపథ్యంలో శ్రీకర రాఘవేంద్ర ఆసుపత్రి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, విచారణలో వైద్య నిర్లక్ష్యం నిర్ధారణ అయితే బాధ్యులైన వైద్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రి నిర్వహణలో నిబంధనల ఉల్లంఘనలు ఉన్నట్లు తేలితే ఆసుపత్రిని మూసివేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.
దివ్య మృతికి న్యాయం చేయాలని కోరుతూ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ర్యాలీగా వెళ్లి కూసా పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు, సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరారు.దివ్య మృతిపై సమగ్ర విచారణ జరిపి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.