telangana
కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో వైభవంగా దీపావళి వేడుకలు..
సూర్య మల్యాల : కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఉదయం శ్రీ స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించి, పట్టు వస్త్రాలతో విశేషంగా అలంకరించారు. అనంతరం స్వామివారికి సహస్రనామార్చన నిర్వహించారు.సాయంకాలం లక్ష్మీ పూజతో పాటు శాస్త్రోక్తంగా సహస్ర దీపాలంకరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా దీపకాంతులతో శోభాయమానంగా మారింది.