BREAKING
మెగా రైతు మేళాకు భారీగా తరలిన రైతులు ప్రజావాణికి ఒకే ఒక్క దరఖాస్తు ఎంపీడీవో జయరాం విజయ్ నిరుపేదలకు వరం ముఖ్యమంత్రి సహాయ నిధి ఆంత్రోపిక్‌కు షాక్...'క్లాడ్' సబ్‌స్క్రిప్షన్ మార్కెటింగ్ వివాదంపై కోర్టులో కొనసాగనున్న వ్యాజ్యం ఫ్రాన్స్‌లో స్మార్ట్ రిఫ్రిజిరేటర్లపై సైబర్ దాడి కలకలం హరిత భవిష్యత్తుకు గ్రిడ్లు, ఫైనాన్స్, ఉద్యోగ కల్పనే కీలకం అమెరికాలో పెరుగుతున్న నిరుద్యోగ భయాలు డ్రోన్ ముప్పును తిప్పికొట్టేందుకు అమెరికా కీలక నిర్ణయం అమెరికాలో హోండా ఓహియోలో రూ.25 వేల కోట్లతో కొత్త ఆటో ప్లాంట్ కుంభ రాశి వారఫలాలు | 08 NOV 2026 - 14 NOV 2026 | Aquarius Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani పోలాండ్‌లోని క్రాకోవ్ నగరంలో కాల్పుల ఘటన...దిగ్భ్రాంతిలో దేశ ప్రజలు ఈయూ బడ్జెట్‌లో పర్యవేక్షణ తగ్గిస్తే సహించేది లేదు యంగ్ హీరో రోషన్ మేకతో దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ క్రేజీ ప్రాజెక్ట్.. జటాయుగా రానున్న విజువల్ వండర్ యూరోపియన్ యూనియన్ నుంచి యూనిక్రెడిట్‌కు ఊరట మీన రాశి వారఫలాలు | 08 NOV 2026 - 14 NOV 2026 | Pisces Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

కొడంగల్ మెగా రైతు మేళాకు షాబాద్ నుంచి మహిళా రైతుల భారీ తరలింపు

Select Suryaa Now
కొడంగల్ మెగా రైతు మేళాకు షాబాద్ నుంచి మహిళా రైతుల భారీ తరలింపు

 

షాబాద్, మేజర్ న్యూస్ (నవంబర్ 09)

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ, సహకార శాఖ ఆధ్వర్యంలో కొడంగల్‌లో నిర్వహిస్తున్న మెగా రైతు మేళా – అగ్రో ఇండస్ట్రియల్ ఎక్స్‌పో 2026 కార్యక్రమానికి షాబాద్ మండలం నుంచి రైతులు, మహిళా రైతులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. ఈ సందర్భంగా రైతులు, మహిళా రైతులు ప్రత్యేక బస్సుల్లో కొడంగల్‌కు బయలుదేరగా, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. అనంతరం ఆయన కూడా రైతులతో కలిసి బస్సులో ఈ కార్యక్రమానికి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నూతన సాగు పద్ధతులు, వ్యవసాయ యాంత్రీకరణ, అనుబంధ రంగాల అభివృద్ధిపై రైతులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. రైతు మేళాలు రైతులకు ఎంతో ఉపయోగకరమని, ఇలాంటి కార్యక్రమాల ద్వారా నూతన వ్యవసాయ విధానాలను తెలుసుకొని అధిక దిగుబడులు సాధించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ వైస్ చైర్మన్ కావాలి చంద్రశేఖర్, షాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడుపల్లి పెంటారెడ్డి, వ్యవసాయ అధికారి విజయచంద్ర, సంబంధిత క్లస్టర్ల ఏఈఓలు, సర్పంచులు ప్రభాకర్ రెడ్డి, స్వరూప, మహేందర్ గౌడ్, శాంతమ్మ యాదయ్య, సందీప్, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు, మహిళా రైతులు పాల్గొన్నారు.