BREAKING
కూటమి మేయర్ అభ్యర్థి అప్పలనాయుడుకు ఎమ్మార్పీఎస్ సంఘీభావం --మంత్రి నాదెండ్ల మనోహర్ ను కలిసిన పొలిమేర హరికృష్ణ అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ కార్యకర్తకు అండగా నిలిచిన కేంద్రమంత్రి వర్మ -- నాగరాజుకు రూ.1 లక్ష ఆర్థిక సాయం, ఇద్దరు కుమార్తెల విద్యా ఖర్చులు భరిస్తానని హామీ ధనలక్ష్మీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీమహమ్మారమ్మ కూటమి మేయర్ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి -- టిడిపి, బిజెపి శ్రేణులకు, ప్రజలకు మంత్రి నాదెండ్ల, శాసనసభ్యులు విజ్ఞప్తి జిల్లా పోలీస్ కార్యాలయం లో ఘనంగా ఆయుధ, వాహన పూజలు -- శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీవినీత్ నింభ కుసుమ హారతితో శాంతించిన అమ్మవారు ఉదయం మహిషాసుర మర్దిని.. సాయంత్రం కాళికాదేవిగా వాసవీ అమ్మవారి దర్శనం 25న విజయ భేతాళ స్వామి వాహన మహోత్సవం :అధికారుల కీలక సమీక్ష, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు! మిట్స్‌ వర్సిటీకి శోధ్‌గంగ,శోధ్‌గంగోత్రి ప్రాజెక్టుల అమలుకు ఎంఓయూ : వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి.యువరాజ్ పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా స్మృతి పరేడ్ రిహార్సల్స్ రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ సేవలు స్ఫూర్తిదాయకం : డాక్టర్ స్వాతి చక్రపాణి మూడు జడ్పీటీసీలు టీడీపీకే.. ఎంపీపీ పదవుల్లో జనసేనకు ఒకటి, టీడీపీకి రెండు కూటమి ఐక్యతే విజయానికి పునాది.. అభివృద్ధి, సంక్షేమమే ఎన్నికల అజెండా-ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ భక్తిశ్రద్ధలతో దుర్గమ్మ అమ్మవారి కి ప్రత్యేక పూజలు అంతరాయం లేని విద్యుత్తును అందించాలి. విద్యుత్ శాఖఈ ఈ రామయ్య. చిన్నారి వినయ్ వైద్యానికి సీఎం సహాయనిధి భరోసా : ఎమ్మెల్యే జహా

కల్వకోల్‌లో వైభవంగా వాసవి మాత నవరాత్రి ఉత్సవాలు,, శ్రీమహాలక్ష్మిగ దర్శనమిచ్చిన అమ్మవారు

Select Suryaa Now
కల్వకోల్‌లో వైభవంగా వాసవి మాత నవరాత్రి ఉత్సవాలు,, శ్రీమహాలక్ష్మిగ దర్శనమిచ్చిన అమ్మవారు

పెద్దకొత్తపల్లి. సూర్య న్యూస్: మండల పరిధిలోని కల్వకోల్ గ్రామంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు శనివారం అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. సోమిశెట్టి ప్రేమ్‌కుమార్ గృహంలో అభిషేకం, అష్టోత్తర పూజ, సుహాసిని పూజ కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బ్రాహ్మణ వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు.ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షుడు ఆకుతోట రాజశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.ఎం. స్వామి, కొల్లాపూర్ మండల అధ్యక్షుడు సోమిశెట్టి చంద్రశేఖర్, ఓరుగంటి శ్రీనివాసులు, అమ్రవాది కృష్ణయ్య తదితర ప్రముఖులు హాజరయ్యారు. వీరిని కల్వకోల్, చెన్నప్పరావుపల్లి గ్రామాల ఆర్యవైశ్యులు ఘనంగా సన్మానించారు.అమ్మవారి శాశ్వత పూజ కోసం శివకుమార్–మౌనిక దంపతులు వెండి వినాయక విగ్రహాన్ని, వాసవి మాతకు వెండి కిరీటాన్ని బహూకరించారు.ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షుడు సోమిశెట్టి ప్రేమ్‌కుమార్, కార్యదర్శి ప్రదీప్‌కుమార్, సందీప్‌కుమార్, వాసవి సిండికేట్ అధ్యక్షుడు కలకొండ రాంబాబు, ఆర్యవైశ్య ప్రముఖులు, వనిత క్లబ్ అధ్యక్షురాలు సోమిశెట్టి శ్రీలత, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.