telangana
కామారెడ్డి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి - MCPI(U) జిల్లా కార్యదర్శి జబ్బర్ డిమాండ్
సూర్య కామారెడ్డి జిల్లా ప్రతినిధి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కామారెడ్డి జిల్లాను కరువు జిల్లా గా తక్షణమే ప్రకటించి ప్రభుత్వం ఆదుకోవాలని పత్తి పంటకు ఎకరానికి 50,000వరి పంటకు ఎకరానికి 30 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ పథకం కింద 200 రోజులు పని కల్పించాలని రోజుకు 600 రూపాయలు ఇవ్వాలని గ్రామాలలో మంచినీటి సౌకర్యం కల్పించాలని అన్నారు. ఎంసీపీ ఐ (యూ) రాష్ట్ర జిల్లా నాయకులు ప్రసాద్ రమేష్ నరేందర్ కిషన్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు.