జనగణన 2027 ఫేజ్ -2 శిక్షణా కార్యక్రమం..జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాస్
--జనగణన-2027 ఫేజ్-2 శిక్షణా కార్యక్రమం... జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాస్
ఖమ్మం, (సూర్య బ్యూరో):
జనగణన-2027 ప్రక్రియలో భాగంగా జిల్లా పంచాయతీ రీసోర్స్ సెంటర్ భవనం నందు చార్జ్ క్లర్కులు, టెక్నికల్ అసిస్టెంట్లకు రెండు రోజులు నిర్వహించిన ఫేజ్-2 శిక్షణా కార్యక్రమం విజయవంతంగా ముగిసినట్లు జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి ఏ. శ్రీనివాస్ అన్నారు. రాబోయే ఫిబ్రవరి 2027 లో జరగనున్న జనగణన క్షేత్రస్థాయి విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ శిక్షణను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి మాట్లాడుతూ, శిక్షణా తరగతులకు హైదరాబాద్‌లోని సెన్సస్ డైరెక్టరేట్ కార్యాలయం నుండి సెన్సస్ అధికారులు హిమవర్ష, రాజు ముఖ్య శిక్షకులుగా హాజరై, శిక్షణ ఇచ్చినట్లు అన్నారు. జిల్లా పరిధిలోని అన్ని మండలాల తహశీల్దార్ కార్యాలయాలు, మున్సిపాలిటీలు, ఖమ్మం కార్పొరేషన్ పరిధికి చెందిన చార్జ్ క్లర్కులు, టెక్నికల్ అసిస్టెంట్లకు జనగణన విధివిధానాలపై సమగ్ర అవగాహన కల్పించినట్లు తెలిపారు.
జనగణన-2027 ప్రక్రియ దేశ ప్రగతికి, అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు ఎంతో కీలకమైనదని అన్నారు. ఫిబ్రవరి 2027 లో జరిగే జనగణన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయిలో సేకరించాల్సిన వివరాలు, ఫారాల నమోదు, మొబైల్ యాప్ / పోర్టల్ వినియోగం, చార్జ్ రిజిస్టర్ల నిర్వహణ తదితర సాంకేతిక అంశాలపై శిక్షణ ఇచ్చారన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పక్కా ప్రణాళికతో, గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. విధుల నిర్వహణలో ఏవైనా సందేహాలుంటే ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకుంటూ సమన్వయంతో పనిచేయాలని జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన ప్రణాళిక విభాగ అధికారులు, సంబంధిత మండల, మున్సిపల్ చార్జ్ క్లర్కులు, టెక్నికల్ అసిస్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు.