జాతీయ ఉత్తమ సర్పంచిగా వల్లంల సంతోష్ యాదవ్ ఎంపిక....!
మర్రిగూడ, మేజర్ న్యూస్: యరగండ్లపల్లి గ్రామ సర్పంచ్ వల్లంల సంతోష్ యాదవ్ జాతీయ ఉత్తమ సర్పంచ్ పురస్కారానికి ఎంపికయ్యారు. బహుజన సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందిస్తుందని జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ ప్రకటనలో తెలిపారు. గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలకు ఈ జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. సర్పంచ్‌గా ప్రమాణ స్వీకారం చేసిన రోజే గ్రామానికి అంబులెన్స్ అందించడం విశేషం. ఉచిత వైద్య శిబిరాలు, పారిశుధ్యం, మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. గ్రామంలో అమలవుతున్న అభివృద్ధి పనులను పరిశీలించేందుకు VB-GRAMG కేంద్ర బృందం సైతం సందర్శించింది. ఈ నెల 15న ఢిల్లీలో బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంలో ఆయనకు పురస్కారం అందజేయనున్నారు. ఈ ఎంపికపై గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ సంతోష్ యాదవ్‌కు అభినందనలు తెలియజేస్తున్నారు.